Most Recent

Vijay Deverakonda: మసమరజ చసతనన వజయ దవరకడ నయ మవ పరలక

Vijay Deverakonda: మెస్మరైజ్ చేస్తోన్న విజయ్ దేవరకొండ నయా మూవీ ప్రీలుక్

హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విజయ్. నాని నటించిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు విజయ్. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ కు మంచి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ క్రేజ్ ను విపరీతంగా పెంచేసింది. ఈ సినిమాతో నైటుకు నైటే స్టార్ హీరో అయ్యాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందం సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఈ రౌడీ హీరో మార్కెట్ పెరిగింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ విజయ్ కు అర్జున్ రెడ్డి స్థాయిలో హిట్ దక్కడం లేదు.

రీసెంట్ గా వచ్చిన లైగర్ సినిమా ప్రేక్షకులను, అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో మెప్పించడానికి సిద్ధం అవుతున్నాడు విజయ్. ఈ క్రమంలోనే విజయ్ కెరీర్ లో 12వ సినిమా రానుంద. గౌతమ్ తిన్ననూరితో కలిసి సినిమా చేస్తున్నారు దేవరకొండ.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైంది. హైద్రాబాద్ లోని సారధి స్టూడియోస్లో ఈ మూవీ షూటింగ్ జరిగింది. అలాగే ఈ సినిమానుంచి ఓ ప్రీలుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో విజయ్ తుపాకీ గురి పెట్టి కనిపిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక విజయ్ ఖుషి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.