Most Recent

Spy Twitter Review: థయటరలలక వచచసన సప.. నఖల వనమయన ష.. కరరల ఇద ఫసట ట.!

Spy Twitter Review: థియేటర్లలోకి వచ్చేసిన ‘స్పై’.. నిఖిల్ వన్‌మ్యాన్ షో.. కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైం.!

గూఢచర్యం, రా ఏజెంట్ల నేపధ్యంలో ఇప్పటికే ఇండియన్ స్క్రీన్‌పై చాలానే సినిమాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని హిట్ కాగా.. మరికొన్ని డిజాస్టర్‌గా మిగిలాయి. ఇక ఈ జోనర్‌లో తన లక్ పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు హీరో నిఖిల్ సిద్దార్థ్. అతడు ప్రధాన పాత్రలో దర్శకుడు గ్యారీ బీ.హెచ్ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘స్పై’. ఐశ్వర్య మీనన్ హీరోయిన్. సుభాష్ చంద్రబోస్ అదృశ్యం కథాంశంగా తెరకెక్కిన ఈ మూవీ బక్రీద్ కానుకగా జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజైంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన యూఎస్ ప్రీమియర్స్ ఇప్పటికే పడిపోగా.. ఫ్యాన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ఈ సినిమా సూపర్ హిట్ అని అంటుంటే.. మరికొందరు నేరేషన్ ఫ్లాట్‌గా ఉందని.. నార్మల్ ‘స్పై’ మూవీల మాదిరిగానే ఉందంటున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని.. సెకండాఫ్ సినిమాకు ప్రాణం అని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమాను హీరో నిఖిల్ వన్ మ్యాన్ ఆర్మీలా ముందుండి నడిపించాడని.. అతడి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎంగేజింగ్ సీన్స్‌తో పాటు గూస్‌బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఉన్నాయని.. సినిమాకి హీరో నిఖిల్ యాక్టింగ్ ప్రధాన బలం అని.. ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంచేందుకు డైరెక్టర్ కొన్ని కొత్త సీన్స్ చూపించారని’ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.

కొంతమంది కెమెరా వర్క్ బాగుందన్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపించింది. సెకండాఫ్‌లో రెండు నిమిషాల పాటు కనిపించే రానా దగ్గుపాటి పాత్ర అందరికీ నచ్చుతుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే గుహ ఫైట్ అయితే గూస్‌బంప్స్ అని నెటిజన్లు అంటున్నారు. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌కు ప్రేక్షకులు చూసేందుకు మంచి ‘స్పై’ థ్రిల్లర్ అని చాలామంది చెబుతున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.