Most Recent

Rakesh Master: రకష మసటర ఎనన సనమల చశర.. ? ఆయన శషయల ఎవర మక తలస..?

Rakesh Master: రాకేష్ మాస్టర్ ఎన్ని సినిమాలు చేశారో.. ? ఆయన శిష్యులు ఎవరో మీకు తెలుసా..?

రాకేష్‌ మాస్టర్‌ పేరే ఓ వైబ్రేషన్‌. మనిషి స్ట్రెయిట్‌ ఫార్వర్డ్‌. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. తాను చేయాలనుకుందే చేస్తారు. ఎవరి అభిప్రాయంతో ఆయనకు పనిలేదు. అందుకే.. దేవుడితో ఏదో అర్జంటు పనున్నట్లు ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాకేశ్​మాస్టర్ 1968లో తిరుపతిలో జన్మించారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఆయనకు నలుగురు అక్కలు, అన్న, తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ దగ్గర కొంతకాలం పనిచేశారు రాకేశ్.  డ్యాన్సర్​గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత  సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అలా ఎన్నో విజయవంతమైన పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘చిరునవ్వుతో’, ‘దేవదాసు’, ‘అమ్మో పోలీసోళ్లు’, ‘సీతయ్య’ సహా పలు సూపర్ హిట్​ సినిమాలకు రాకేశ్​ కొరియోగ్రఫీ చేశారు.

ఇక సోషల్​మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రాకేష్‌ మాస్టర్‌. తరచూ యూట్యూబ్​ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఫన్నీ వీడియోలు చేస్తున్నారు. ఇక పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కూడా అయ్యాయి. తన కెరీర్​ను కొంతమంది కలిసి నాశనం చేశారని ఆరోపిస్తూ యూట్యూబ్​లో బాగా ట్రెండ్ అయ్యారు. దీంతో ఆయన మతిస్థిమితం కోల్పోయారని కూడా చాలా మంది విమర్శించారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్​లో టాప్​ కొరియోగ్రాఫర్స్​గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ సహా మరికొందరు ఒకప్పుడు ఆయన శిష్యులే.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్‌కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించారు. అలా డాన్స్ నేర్పిస్తున్న ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫోటోని షేర్ చేస్తూ అభిమానులు ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. ఇక రాకేష్‌ మాస్టర్‌ మరణవార్త విని చాలా మంది షాక్ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.Rakesh Master


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.