![Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణికి ఆ స్టార్ హీరో అంటే ఇష్టమట.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/06/pawan-kalyan-26.jpg)
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎవరంటే టక్కున చెప్పే పేర్లల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అటు రాజకీయాల్లో, సినిమా రంగంలో రాణిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా, స్టార్ హీరోగా బిజీ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారంలో బిజీ బిజీగా పర్యటిస్తున్నారు. పవన్ సభ పెడితే లక్షల్లో జనాలు వస్తారు. ఆయన చేసే ఆవేశ ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో ఓజి ఇలా సినిమాలు చేస్తున్నారు పవన్.
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ , చిరంజీవి అని తెలిపారు. దాంతో ఆయా అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య కు ఇష్టమైన హీరో ఎవరు అనేదాని పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా కు ఇష్టమైన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఇద్దరు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ భార్య కు మహేష్ అంటే ఇష్టమట. మహేష్ బాబు సతీమణి నమ్రత, అన్నా లెజినోవా మంచి మిత్రులు, ప్రతి క్రిస్మస్ కు మహేష్ దంపతులకు గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారు. అలాగే సమ్మర్ లో పవన్ కళ్యాణ్ దంపతులు మహేష్ ఫ్యామిలీకి మామిడి పండ్లు పంపిస్తూ ఉంటారు.
Mahesh Babu