సినిమా ఇండస్ట్రీ హీరోలతో సరిసమానంగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో నయనతార ఒకరు. సౌత్ ఇండియన్ లేడీ సూపర్ గా పేరు సొంతం చేసుకున్నారు నయన్. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది నయన్. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే రీసెంట్ గా మలయాళంలోనూ సినిమాలు చేసింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు నయన్ పెట్టింది పేరు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది నయన్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది నయన్.
ఇదిలా ఉంటే తాజాగా నయన్ దంపతులు తల్లి తండ్రులుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. కవల పిల్లలకు జన్మానించారు ఈ జంట. ఆయింట్ నయన్ సరోగసి ద్వారా పిల్లలకు జన్మనించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈ జంట పై పలు విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి.
పిల్లలు పుట్టిన తర్వాత నయన్ పూర్తి సమయం వారికే కేటాయిస్తుంది. తాజాగా పిల్లల గురించి స్పందించింది ఈ బ్యూటీ. ఇటీవలే పిల్లల మొహాలను అభిమానులకు చూపించింది నయన్. నేను నా గర్భం నుంచి పిల్లలకు జన్మనివ్వకపోయినా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రస్తుతం అమ్మగా నేను చాలా సంతోషంగా పిల్లలతో గడిపేస్తున్నా అని తెలిపారు నయన్. ఇక పిల్లలు పుట్టిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయిందని.. వారితోనే నా రోజు మొదలవుతుంది.. పూర్తవుతుంది అని చెప్పుకొచ్చారు ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు సినిమాల విషయాన్ని కొస్తే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జవాన్ సినిమాలో నటిస్తోంది.