నట సింహం నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బాలయ్య అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఇక బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ లో క్యాన్సర్ బాధిత పిల్లల మధ్య తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. చిన్నారులకు పండ్లు, గిఫ్ట్ ప్యాకెట్స్ అందించారు బాలయ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు బాలకృష్ణ జన్మదిన వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు అగ్రరాజ్యం అమెరికాలోనూ మిన్నంటాయి. ఎన్నారైలు వినూత్నం బాలయ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై బాలకృష్ణ ఫొటోలను టెలికాస్ట్ చేసి బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. 150 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పు స్క్రీన్‌పై బాలకృష్ణ ఫొటోలను డిస్‌ప్లే చేశారు. ఇందులో భాగంగా బాలకృష్ణ నటించిన పలు సినిమాల్లోని ఫొటోలను ప్రదర్శించారు.
అమెరికా సమయం ప్రకారం.. జూన్ 10వ తేదీ అర్ధరాత్రి నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున టైమ్స్ స్క్వేర్‌పై ఫొటోలను ప్రదర్శించారు. అట్లూరి ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ అట్లూరి జితేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు, బాలకృష్ణ అభిమానులు భారీగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి అభిమానులు పంచుకున్ఆనరు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..