Most Recent

AAA Cinemas: పరభస ఆదపరషత పరరభకననన ఐకన సటర థయటర..

AAA Cinemas: ప్రభాస్ ఆదిపురుష్‌తో ప్రారంభంకానున్న ఐకాన్ స్టార్ థియేటర్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నయా బిజినెస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఏషియన్ థియేటర్స్ తో కలిసి బన్నీ థియేటర్స్ బిజినెస్ మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు. నేడు ఈ థియటర్ గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నారు. అధునాతన టెక్నాలజీతో ఈ థియేటర్ ను ముస్తాబు చేశారు. ఈ మాల్, మల్టీప్లెక్స్ ను అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు ఈ థియేటర్ ను ఓపెన్ చేయనున్నారు. ఏఏఏ మల్టీప్లెక్స్ ఈ నెల 16వ తేదీన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించనున్నారు. నేడు ఈ థియేటర్ ను ఓపెన్ చేసి రేపటి నుంచి ఆదిపురుష్ సినిమాతో థియేటర్ ఆపరేషన్స్ ను మొదలు పెట్టనున్నారు. తొలి సినిమానే మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ తో మొదలవుతోన్న ఈ థియేటర్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. ఈ మూవీకి అన్ని భాషల్లో భారీ బజ్ క్రియేట అయ్యింది.

ఇప్పటికే ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమా 2000వేల కోట్లు వసూల్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ పేరు ప్రపంచమంతా మారుమ్రోగనుంది. ఇప్పటికే సెలబ్రెటీలంతా ఈ సినిమా పై ఆసక్తిగా ఉన్నారు. పలువురు వేల సంఖ్యలో టికెట్స్ ను కొనుగోలు చేసి ఆర్ఫాన్స్ కు అందించారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ తన థియేటర్ లో ఆదిపురుష్ సినిమా రిలీజ్ చేయడంతో అటు ప్రభాస్ అభిమానులు, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.