
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, గతంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జైలర్ కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులను అలరించింది. రజనీకాంత్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమాలోని ఇతర నటీనటుల పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఓ చిన్నారి తన నటనతో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంతకీ ఆ బాలుడు ఎవరు? అతడికి ఈ సినిమా కోసం ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసుకుందాం.. జైలర్ 2 లో రజనీకాంత్ మనవడి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సూపర్‌స్టార్‌తో కలిసి తెరపై కనిపించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నా భర్త మామూలోడు కాదు.. 9మంది అమ్మాయిలను మోసం చేశాడు
చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న రిత్విక్ గురించి ప్రస్తుతం సినీ అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, యోగిబాబు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇంతమంది స్టార్ నటీనటుల మధ్య రిత్విక్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఇప్పుడు సినిమాలకు దూరం ఇలా ..
‘జైలర్ 2’ విజయంతో పాటు ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ గురించి కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం రిత్విక్‌కు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పారితోషికం అందినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రిత్విక్‌కు బాలనటుడిగా మంచి అనుభవమే ఉంది. గతంలోనూ పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్, నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘O2’, కార్తీ నటించిన సర్దార్ వంటి చిత్రాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పుడు జైలర్ 2 తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బాలనటుడిగా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. చిన్న వయసులోనే విభిన్న పాత్రల్లో నటిస్తున్న రిత్విక్ భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తాడేమో చూడాలి.
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.