
దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటైన మాయలోడులో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ను హీరోగా ఎంపిక చేయడానికి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో ఆయన పరిశ్రమలోని పుకార్లను, నిర్మాతల వ్యతిరేకతను ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ మాయలోడు సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్‌ను హీరోగా తీసుకోవాలని తాను మొదట అనుకున్నారట. అయితే, ఈ ఆలోచనను నిర్మాతలు ఆమోదించలేదు. రాజేంద్ర ప్రసాద్ గురించి అప్పట్లో పలు ప్రచారాలు నడిచేవి. ఈ పుకార్ల నిజానిజాలను తెలుసుకోవడానికి, కృష్ణారెడ్డి ఒకరోజు ఉదయం తొమ్మిది గంటలకు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లారు. అప్పటికే రాజేంద్ర ప్రసాద్ షూటింగ్‌కు వెళ్లడానికి కారులో సిద్ధంగా ఉండగా, కృష్ణారెడ్డి ఆపి తన కథను వినిపించారు.
అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిపోయి, తన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఆవేదనలో ఉన్న రాజేంద్ర ప్రసాద్, తనను హీరోగా పెట్టి సినిమా తీసే ధైర్యం ఎవరికీ లేదని, కొత్త హీరోలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. “నన్ను పెట్టి సినిమా తీసే దమ్ము నీకుందా?” అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించగా, కృష్ణారెడ్డి తన కథపై, రాజేంద్ర ప్రసాద్ నటనపై పూర్తి నమ్మకంతో ఉన్నానని బదులిచ్చారు. చిరంజీవి గారిని కూడా తాను ఈ కథకు అనుకోవడం లేదని, రాజేంద్ర ప్రసాద్ ఒక్కరే సరైనవారని కృష్ణారెడ్డి చెప్పారు. దీనితో రాజేంద్ర ప్రసాద్ కథకు ఓకే చెప్పి, తాను సినిమా చేస్తానని ఒక లేఖ కూడా ఇచ్చారు. అయితే సినిమా స్టార్ట్ అయ్యాక రాజేంద్రప్రసాద్ డేట్స్ విషయంలో పలు ఇబ్బందులు వచ్చాయని అన్నారు. హీరోయిన్ సౌందర్య ఇచ్చిన డేట్లు మిస్ కాకూడదని తాను ఎంత రిక్వెస్ట్ చేసినా రాజేంద్ర ప్రసాద్ సర్దుబాటు చేయలేదని తెలిపారు
సౌందర్యతో చిత్రీకరించాల్సిన ఒక ప్రత్యేక పాట కోసం రాజేంద్ర ప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో, ఆయనకు ప్రత్యామ్నాయంగా నటుడు బాబు మోహన్‌ను సంప్రదించారు.ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ తిరిగి వచ్చి ఆ పాటను తానే చేస్తానని చెప్పినప్పటికీ, కృష్ణా రెడ్డి తన మాటపై నిలబడ్డారు బాబు మోహన్ వెంటనే అంగీకరించి షూటింగ్‌కు వచ్చారని చెప్పారు. ఇప్పటికే బాబు మోహన్‌కు మాట ఇచ్చానని, ఆ నిర్ణయాన్ని మార్చుకోనని అన్నారు. చివరకు ఆ పాటను బాబు మోహన్‌తోనే చిత్రీకరించగా, ‘మాయలోడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిందని గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..