Most Recent

Kushboo : పది కూడా చదవలేదు.. ఆ ఇద్దరు తెలుగు హీరోలే నాకు ఇంగ్లీష్ నేర్పించారు.. ఖుష్బూ..

Kushboo : పది కూడా చదవలేదు.. ఆ ఇద్దరు తెలుగు హీరోలే నాకు ఇంగ్లీష్ నేర్పించారు.. ఖుష్బూ..

సినీ పరిశ్రమలో నటిగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ సుందర్. ఇటీవల ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఆమె తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తాను ఇంగ్లీష్ భాషను అంత ధారాళంగా , స్పష్టంగా మాట్లాడటానికి కారణం టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున అని తెలిపారు. “మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఇంత మంచి ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు?” అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఖుష్బూ స్పందిస్తూ.. తాను పాఠశాల స్థాయిలో తొమ్మిదో తరగతిలోనే చదువును ఆపేశానని.. తొలినాళ్లలో తనకు ఇంగ్లీష్ భాషపై అంతగా పట్టు లేదని, మాట్లాడటానికి కొంత ఇబ్బంది పడేదాన్ని అని చెప్పారు. అయితే, తన కెరీర్ ఆరంభంలో తెలుగులో చేసిన మొదటి సినిమా దగ్గుబాటి వెంకటేష్‌తో, రెండవ సినిమా అక్కినేని నాగార్జునతో అని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..

ఆ సమయంలోనే వెంకటేష్, నాగార్జున ఇద్దరూ అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చారని చెప్పారు. షూటింగ్ సమయంలో వారిద్దరితో సంభాషిస్తున్నప్పుడు, వారు తనతో ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని ప్రోత్సహించేవారని ఖుష్బూ తెలిపారు. “నువ్వు కచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి” అని వారు తనకు ధైర్యాన్ని ఇచ్చేవారని ఆమె చెప్పారు. అంతేకాకుండా, నాగార్జున గారు తనకు స్వయంగా ఒక ఇంగ్లీష్ నవల్ (పుస్తకం) కానుకగా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..

“ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించు, ఇంగ్లీష్ నవల్స్ చదివితే భాషపై పట్టు వస్తుంది , ధారాళంగా మాట్లాడగలుగుతావు” అని నాగార్జున తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నారు. ఆ విధంగా వెంకటేష్, నాగార్జున ఇచ్చిన ప్రోత్సాహం, నాగార్జున అందించిన పుస్తక పఠనం వల్లే తాను ఇంగ్లీష్ భాషను ఇంత బాగా నేర్చుకోగలిగానని ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

వెంకటేశ్, నాగార్జున,..

Kushboo, Venkatesh, Nagarju

Kushboo, Venkatesh, Nagarju

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.