Most Recent

Bigg Boss Telugu 10: శ్రిష్టికి షాక్.. పవర్ పోయింది! హౌస్‌లో నో ఎలిమినేషన్.. నాగార్జున సర్‌ప్రైజ్

Bigg Boss Telugu 10: శ్రిష్టికి షాక్.. పవర్ పోయింది! హౌస్‌లో నో ఎలిమినేషన్.. నాగార్జున సర్‌ప్రైజ్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వీకెండ్ ఎపిసోడ్‌లో.. శ్రిష్టి చేతిలో ఉన్న పవర్‌ను కోల్పోవడం ఈ ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. హౌస్‌లో దేబ్జానీ తెలుగు సరిగ్గా రాకపోయినా మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని నాగార్జున ప్రశంసించారు. అయితే రోహిత్, షాలినీ, శ్రిష్టిలకు తెలుగు వచ్చినప్పటికీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వారు ఇంగ్లీష్‌లో మాట్లాడటం వల్ల చాలామంది ప్రేక్షకులకు అర్థం కావడం లేదని, తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. అనంతరం శ్రిష్టి, షాలినీలను అమన్‌కు హౌస్‌మేట్స్‌గా రివీల్ చేయించారు.

‘హార్ట్‌కి క్లోజ్.. హార్ట్‌కి దూరం’ ఆట

ఆ తర్వాత నాగార్జున ‘హార్ట్‌కి క్లోజ్.. హార్ట్‌కి దూరం’ ఆటను కంటిన్యూ చేశారు. ఈ గేమ్‌లో ఇంటి సభ్యులు తమకు ఎవరితో సన్నిహిత సంబంధం ఉందో, ఎవరితో దూరంగా ఉన్నారో చెప్పారు. అమన్ తనకు దేబ్జానీ దగ్గరగా ఉంటుందని, షాలినీ దూరంగా ఉంటుందని చెప్పాడు. రామ్ ప్రసాద్ కూడా దేబ్జానీ తనకు దగ్గరని, షాలినీ దూరమని పేర్కొన్నాడు. కృష్ణుడు దేబ్జానీ దగ్గరగా, రోహిత్ దూరంగా ఉన్నాడని చెప్పగా.. ముఖేష్ ఝాన్సీ దగ్గరగా, రోహిత్ దూరంగా ఉన్నాడని వెల్లడించాడు. ఈ సందర్భంగా ముఖేష్ కళ్లను నాగార్జున ప్రశంసించారు. ‘నీ కళ్లు బాగుంటాయి.. చాలా చార్మింగ్‌గా ఉంటాయి’ అని చెప్పడంతో ముఖేష్ థ్యాంక్యూ సార్ అంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే దేబ్జానీ చెబితే నమ్మవా అని నాగార్జున సరదాగా ప్రశ్నించగా.. ముఖేష్ ఇచ్చిన సమాధానంతో అక్కడ నవ్వులు పూశాయి.

ఇక నరేష్ తనకు దేబ్జానీ దగ్గరగా ఉంటుందని, శ్రిష్టి దూరంగా ఉంటుందని చెప్పాడు. షాలినీ మాత్రం అమన్ తనను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని, తనను హర్ట్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై అమన్ స్పందిస్తూ.. షాలినీ తాను చెప్పిందే వినాలని అనుకుంటుందని, తాను చెప్పేది వినకుండా అలుగుతుందని అన్నాడు. దీంతో నాగార్జున ఆడపిల్లలు అలుగుతారు.. వారిని అర్థం చేసుకోవాలని అమన్‌కు సూచించారు. సుధీర్ తనకు ముఖేష్ దగ్గరగా, వర్షిణి దూరంగా ఉందని చెప్పగా.. వంశీ రోహిత్ దగ్గరగా, సుధీర్ దూరంగా ఉన్నాడని వెల్లడించాడు. ఈ గేమ్‌లో దేబ్జానీకి ఎక్కువగా ‘క్లోజ్ టు హార్ట్’ అనే అభిప్రాయాలు రావడంతో నాగార్జున రోహిత్‌ను జాగ్రత్తగా ఉండాలని సరదాగా హెచ్చరించారు నాగ్.

శ్రిష్టి పవర్‌కు బ్రేక్.. సుధీర్‌కు ఛాన్స్

తర్వాతి హౌస్‌మేట్‌గా ముఖేష్‌ను నాగార్జున ప్రకటించారు. అనంతరం బ్లాక్ కీ, పవర్‌కు సంబంధించిన అంశాలను తెరపైకి తీసుకొచ్చారు. ఇంటి సభ్యుల మెజార్టీ ఓట్లు శ్రిష్టికి రావడంతో ఆమె దగ్గర ఉన్న పవర్‌ను నాగార్జున తీసుకున్నారు. ఇప్పటివరకు పవర్ దక్కని సుధీర్, రోహిత్, అమన్, దేబ్జానీలకు ఓ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో సుధీర్ విజయం సాధించి శ్రిష్టి పవర్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రిష్టికి ఊహించని షాక్ తగిలినట్లయింది. పవర్ గేమ్ తర్వాత శ్రిష్టి హౌస్‌మేట్‌గా ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు. వెంటనే నరేష్ కూడా హౌస్‌మేట్ అయ్యాడని వెల్లడించారు. దీంతో ఇంటి సభ్యుల్లో ఉత్సాహం నెలకొంది. తదుపరి డైలాగ్ గుర్తుపట్టే టాస్క్‌ను నిర్వహించారు. ఇంటి సభ్యులను రెండు టీంలుగా విభజించే బాధ్యతను నరేష్‌కు అప్పగించారు. ఈ పోటీలో కృష్ణుడు టీమ్ విజయం సాధించింది. గెలిచిన టీమ్‌కు నాగార్జున స్వీట్స్ పంపించారు. అయితే కృష్ణుడు స్వీట్స్ తినడం మానేశానని చెప్పడంతో, తనకు వచ్చిన స్వీట్స్‌ను ప్రత్యర్థి టీమ్‌కు ఇచ్చాడు.

ఝాన్సీకి హౌస్‌మేట్ ఛాన్స్.. దేబ్జానీ సీక్రెట్ రివీల్

తర్వాత హౌస్‌మేట్‌ను నిర్ణయించేందుకు రోహిత్, వంశీలకు స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ట్రెజర్ బాక్స్‌ను తీసుకురావాలని నాగార్జున సూచించారు. ఆ బాక్స్‌లో ఝాన్సీ పేరు ఉండటంతో ఆమెకు హౌస్‌మేట్ అయ్యే అవకాశం దక్కింది. ఇక కాఫీ కోసం దేబ్జానీని ఓ సీక్రెట్ చెప్పమని నాగార్జున అడిగారు. తనకు ముఖేష్ అంటే ఇష్టమని దేబ్జానీ చెప్పడంతో నాగార్జున సంతోషించారు. ఆమె చెప్పిన సీక్రెట్‌కు మెచ్చి కాఫీ పంపిస్తానని హామీ ఇచ్చారు. చివరగా వర్షిణి, సుధీర్, కృష్ణుడిని గార్డెన్ ఏరియాకు రావాలని నాగార్జున పిలిచారు. దీంతో తమలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారేమోనని ముగ్గురూ కంగారుపడ్డారు. అయితే నాగార్జున అనూహ్యంగా వారికి గుడ్ న్యూస్ చెప్పారు. వర్షిణి, సుధీర్, కృష్ణుడు ముగ్గురూ హౌస్‌మేట్స్ అయ్యారని ప్రకటించారు.ఈ ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ లేకపోవడం ప్రేక్షకులకు కూడా సర్‌ప్రైజ్‌గా మారింది. మొదటి వారం ‘మహా పరీక్ష’గా సాగిందని నాగార్జున తెలిపారు. ఇక రెండో వారం ‘పవర్ ఆఫ్ పీపుల్’గా ఉంటుందని వెల్లడించారు. ఈ వారం ఇంట్లో ఆటలు ఎలా సాగాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? అనే విషయాలను ప్రేక్షకులే నిర్ణయిస్తారని చెప్పారు. మొత్తానికి శ్రిష్టి పవర్ కోల్పోవడం, వరుసగా హౌస్‌మేట్స్ రివీల్ కావడం, ఎలిమినేషన్ లేకపోవడం వంటి వాటితో బిగ్ బాస్ తెలుగు 10 వీకెండ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.