Most Recent

Bigg Boss Prerana: ‘అమ్మను కాబోతున్నా’.. శుభవార్త చెప్పిన హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్.. బ్యూటిఫుల్ వీడియో

Bigg Boss Prerana: ‘అమ్మను కాబోతున్నా’.. శుభవార్త చెప్పిన హీరోయిన్ రష్మిక క్లోజ్ ఫ్రెండ్.. బ్యూటిఫుల్ వీడియో

వినాయక చవితి సందర్భంగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లో జరిగిన పండగ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే ఇదే శుభ ముహూర్తాన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా స్నేహితురాలు, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ ప్రేరణ మాత్రం తాను తల్లి కాబోతున్న విషయాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా భర్తతో కలిసి బేబి బంప్ చూపిస్తూ ఓ అందమైన వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, నెటిజన్లు ప్రేరణ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రేరణకు, పాన్ ఇండియా హీరోయిన్ రష్మికల మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నటి అయ్యే ప్రయత్నాల్లో ఉండగానే వీరు మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాతి కాలంలో రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోగా, ప్రేరణ సీరియల్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ‘కృష్ణ ముకుంద మురారీ’ అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది ప్రేరణ. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్‌లో కంటెస్టెంట్ గా పాల్గొంది. విజేతగా నిలవకపోయినా గ్రాండ్ ఫినాలే వరకు వచ్చింది. టాప్-4లో నిలిచి అభిమానుల మన్ననలు అందుకుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కప్పు కొట్టని ప్రేరణ ఆ తర్వాత కొన్ని రోజులకే తన భర్త శ్రీపాద్‌తో కలిసి ఓంకార్ హోస్ట్ చేసిన ‘ఇస్మార్ట్ జోడీ 3’ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలవడం విశేషం. ఇక 2023 నవంబరులో వీరు పెళ్లి పీటలెక్కగా దాదాపు మూడు సంవత్సరాల తర్వాత శుభవార్త చెప్పారు. ఈ సందర్భంగా బేబీ బంప్ వీడియోని పంచుకుంది ప్రేరణ. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన బుల్లితె సెలబ్రిటీలు ప్రేరణ- శ్రీపాద్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యష్మి గౌడ, రోహిణి తదితరులు వీళ్లకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

బిగ్ బాస్ ప్రేరణ షేర్ చేసిన వీడియో..

 

భర్తతో బిగ్ బాస్ ప్రేరణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.