Most Recent

Bigg Boss 10 Telugu : తొలిరోజే ఇంట్లో రణరంగం.. త్రిగుణ్ vs రోహిత్ నాయిడు.. హౌస్మేట్స్‏కు స్పెషల్ పవర్స్..

Bigg Boss 10 Telugu : తొలిరోజే ఇంట్లో రణరంగం.. త్రిగుణ్ vs రోహిత్ నాయిడు.. హౌస్మేట్స్‏కు స్పెషల్ పవర్స్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ తర్వాత మొదటి రోజే హౌస్‌లో గొడవలు, హీటెక్కిన వాతావరణం కనిపించింది. సోమవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ముఖ్యంగా నటుడు త్రిగుణ్, అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రోహిత్ నాయిడు మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం హౌస్‌ను రణరంగంగా మార్చింది. ముఖ్యంగా త్రిగుణ్ కావాలని రోహిత్ ను ప్రతి విషయంలో టార్గెట్ చేసినట్లుగా కనిపించింది. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. ఇంట్లోకి అడుగుపెట్టిన 16 మందిలో ఇప్పటికే ఎనిమిది మంది ‘మ్యాజికల్ కీస్’ గెలుచుకోగా, మరో ఇద్దరికి మ్యాజికల్ కీస్ రావాల్సి ఉంది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లోని సభ్యులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. “మీరింకా పూర్తిస్థాయి హౌస్ మేట్స్ కాలేదు, వచ్చే వారం నాటికి చాలా మంది వెళ్లిపోతారు” అని చెబుతూ మ్యాజికల్ కీస్ గెలుచుకున్న ఎనిమిది మందిని మిగిలిన వారి నుంచి ఇద్దరిని ఎంచుకోవాలని ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకునే క్రమంలో కంటెస్టెంట్ల మధ్య మొదటి విభేదాలు బయటపడ్డాయి.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

త్రిగుణ్ vs రోహిత్ నాయిడు:

సెలెక్షన్స్ విషయంలో త్రిగుణ్.. వంశీ, కృష్ణుడు పేర్లను ప్రతిపాదించగా, షాలిని, అగ్నిపరీక్ష టీమ్ సభ్యులు రోహిత్ నాయిడు పేరును చెబుతారు. అందుకు కారణంగా ఎంట్రీ టాస్క్‌లో రోహిత్ వాటర్ కొట్టే పని సరిగ్గా చేయలేదంటూ త్రిగుణ్ అతడిని పాయింట్ అవుట్ చేశారు. గ్రూపిజమ్ చేస్తున్నారంటూ అగ్నిపరీక్ష టీమ్‌పై త్రిగుణ్ మండిపడగా, “సెలెబ్రిటీలు మాత్రమే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటుంటే మేం ప్రశ్నించకూడదా?” అని షాలిని, శ్రిష్టి, రోహిత్, అమన్ తీవ్రంగా ఎదురుదాడికి దిగారు. త్రిగుణ్ వ్యాఖ్యలతో హౌస్‌లో వాతావరణం కాసేపు చాలా సీరియస్‌గా మారింది. మీ నిర్ణయం నాకు ఫెయిర్‌గా అనిపించలేదు అని రాం ప్రసాద్‌తో దేబ్జానీ అంటుంది. కానీ సెలెబ్రిటీ కేటగిరీలో ఉన్న ఇద్దరికే ఇవ్వడం హ్యాపీ అని నవ్వేస్తుంది. మీరు అందరు తీసుకున్న నిర్ణయం లా లేదు.. ఆయన నిర్ణయంలా ఉందని వర్షిణి, ఝాన్సీ ఇలా అందరికీ ఎక్కించే ప్రయత్నం చేస్తుంటాడు సుధీర్. అందరి నిర్ణయం అంటూ తెల్చీపడేస్తుంది వర్షిణి.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

కిచెన్ గొడవలు :

ఆ తర్వాత హౌస్ పనుల విభజన (కిచెన్, క్లీనింగ్) సమయంలోనూ రచ్చ కొనసాగింది. డ్యూటీల విషయంలో ముఖేష్ గౌడ, రోహిత్, సుధీర్, షాలిని త్రిగుణ్‌తో విభేదించారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ప్రత్యేక పవర్స్ ఇచ్చారు. మ్యాజికల్ కీస్ సొంతం చేసుకున్న ఒక్కొక్కరిని బిగ్ బాస్ పిలిచి.. ఆ పవర్ ఏంటో తెలియపర్చుతాడు. కానీ ఆ పవర్ గురించి ఎవ్వరితోనూ డిస్కషన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు బిగ్ బాస్. త్రిగుణ్‌కి టేక్ ఓవర్ అనే పవర్ వస్తుంది. అంటే ఎదురుగా ఉన్న ఏ కంటెస్టెంట్ పవర్‌ని అయినా తీసుకోవచ్చని అర్థం. సింగర్ ఝాన్సీకి ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే పవర్ లభించగా, ముఖేష్ గౌడకు వేరొకరి పవర్‌ను రివర్స్ చేసే అవకాశం దక్కింది. దేబ్జాని బ్యాటరీ సరిగ్గా వేసుకోకపోవడంతో బిగ్ బాస్ హెచ్చరించడం, ఆమె సారీ చెప్పడం జరిగింది. వర్షిణికి గ్రాబ్ ఎనీ విన్, కృష్ణుడు.. స్వాప్.. ఎలిమినేషన్ కాకుండా.. ఏ ప్లేయర్ ప్లేస్‌ని అయినా స్వాప్.. ఎవరి స్థానాన్ని అయినా స్వాప్.. చేసే పవర్, శాలినీ.. డ్యూటీ అసైన్ చేయడం.. ఇంట్లో ఉన్నంత వరకు అదే డ్యూటీ, శ్రిష్టి.. డైరెక్ట్ నామినేట్ చేసే పవర్, రాం ప్రసాద్.. సేఫ్ షీల్డ్.. నామినేషన్‌ నుంచి సేవ్ చేయొచ్చు, నరేష్.. నామినేషన్లో డబుల్ ఓట్స్ చేసే పవర్‌లు లభిస్తాయి.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

చివరగా రకరకాల చర్చల అనంతరం రాం ప్రసాద్ బ్లూ టీం లీడర్‌గా, రోహిత్ నాయిడు రెడ్ టీం లీడర్‌గా ఎంపికవ్వడంతో ఎపిసోడ్ ముగిసింది. మొదటి రోజే సెలెబ్రిటీలు vs అగ్నిపరీక్ష టీమ్ మధ్య మొదలైన ఈ పోరు రానున్న రోజుల్లో మరింత వేడెక్కేలా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.