Most Recent

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంచ్.. ఈసారి కొత్త టైమింగ్స్.. ఇక రచ్చే భయ్యో..

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంచ్.. ఈసారి కొత్త టైమింగ్స్.. ఇక రచ్చే భయ్యో..

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం కావడానికి సిద్ధమైంది. ‘దశావతారం’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లో ఈ షో స్టార్ట్ కాబోతుంది. స్టార్ మా , డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ షో ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 06 (ఆదివారం) రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఇక క్రమం తప్పకుండా వచ్చే డైలీ ఎపిసోడ్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు టెలికాస్ట్ అవుతాయి. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించే వీకెండ్ (శని, ఆదివారాలు) స్పెషల్ ఎపిసోడ్లు మాత్రం రాత్రి 9:00 గంటలకు ప్రసారం కానున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ ప్రసార సమయం రాత్రి 10:00 గంటలకు ఉండటంతో ఫ్యామిలీ అడియన్స్, ఉద్యోగాలు చేసేవారు ఈ షో చూడడానికి కాస్త ఇబ్బంది పడేవారు. ఎందుకంటే రాత్రి 10 గంటలకు షో ప్రారంభమైతే పూర్తయ్యేసరికి 11 గంటలు దాటేది. అయితే, ఈసారి టెలికాస్ట్ సమయాన్ని రాత్రి 9:30 గంటల ప్రైమ్ టైమ్‌కి ముందుకు జరపడంతో బిగ్ బాస్ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల షో టీఆర్‌పీ (TRP) రేటింగ్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

తెలుగులో 2017లో ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన మొదటి సీజన్ రాత్రి 9:30 గంటలకే ప్రసారమై అపూర్వ ఆదరణ పొందింది. 2018లో నాని నిర్వహించిన రెండో సీజన్ కూడా ఇదే సమయానికి వచ్చింది. ఆ తర్వాత నాగార్జున బాధ్యతలు చేపట్టిన నాలుగో సీజన్ నుంచి ప్రసార సమయాన్ని రాత్రి 10:00 గంటలకు మార్చారు. మధ్యలో కొన్ని సీజన్లకు సమయాలు మారినప్పటికీ, ఈ పదో సీజన్‌కు తిరిగి 9:30 గంటల ప్రైమ్ టైమ్‌ను కేటాయించడం విశేషం. వరుసగా ఎనిమిదోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఈ పదో సీజన్‌ను మరింత గ్రాండ్‌గా నడిపించనున్నారు. ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన ఆరుగురు కామనర్లతో పాటు, 10 మంది సెలబ్రిటీలు మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. కొత్త సమయం, కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న బిగ్ బాస్ 10 బుల్లితెరపై సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.