
బుల్లితెర ప్రేక్షకులకు సోషల్ మీడియా ఫాలోవర్లకు బాగా పరిచయమున్న జోడీ రీతూ చౌదరి, డీమాన్ పవన్. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారింది. వీరు ప్రేమికులు కూడా అయ్యారంటూ కామెంట్స్ వినిపిస్తున్నా రీతూ కానీ, పవన్ కానీ ఈ విషయంపై నోరు మెదపడం లేదు. కానీ బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత కూడా వీరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. నిత్యం ఈవెంట్లు, షోలలో కలిసి కనిపిస్తున్నారు. తాజాగా ఈ ప్రేమ జంట కలిసి ‘బంగారం’ అనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో కలిసి నటించారు. ఇటీవలే రిలీజైన ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లో డీమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే కెమిస్ట్రీ కూడా బాగానే పండింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ బంగారం సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ సాంగ్ లో ప్రేమికులుగా కనిపించారు పవన్, రీతూ. అలాగే పెళ్లి బట్టల్లోనూ కనిపించడంతో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోనుందని రూమర్లు మొదలయ్యాయి. ఇదే విషయంపై రీతూ చౌదరి స్పందిస్తూ డీమాన్ పవన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘బంగారం’ సాంగ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రీతూను యాంకర్ ఓ ప్రశ్న అడిగారు.. ‘మీరిద్దరూ కలిసి చేసే వీడియోలు చూస్తే చాలామంది నిజంగానే ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. కామెంట్ సెక్షన్‌లో ‘రీతూ చౌదరి – డీమన్ పవన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని కూడా అడుగుతున్నారు. దీనిపై మీ సమాధానం ఏమిటి? అని రీతూను అడిగారు. దీనికి రీతూ స్పందిస్తూ.. ‘రీల్ కపుల్ రియల్ కపుల్ కావడం అంత ఈజీ కాదు. దానికి చాలా సమయం పడుతుంది. ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ చాలా ముఖ్యం. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో ఒకే అభిప్రాయం ఉండాలి. అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మేం చాలా హ్యాపీగా ఉన్నాం. మంచి స్నేహితులమయ్యాం. కలిసి మంచి ప్రాజెక్టులు చేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని ఇలాగే ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూ ఉండండి’ అని సమాధానమిచ్చింది రీతూ చౌదరి. తద్వారా ప్రస్తుతం పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. రీతూ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీతూ చౌదరీ, డీమాన్ పవన్ ల రొమాంటిక్ సాంగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.