
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఎక్స్ ప్రెస్ హరి కూడా ఒకడు. తన దైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెరపై మంచి కమెడియన్ గా, నటుడిగా బాగా పాపులర్ అయ్యాడీ నటుడు. అంతుకు ముందు పటాస్ షోలో స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు హరి. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీషో తో అందరి నోళ్లల్లో నానాడు. అన్నట్లు ఎక్స్ ప్రెస్ హరిలో మరో ట్యాలెంట్ కూడా ఉంది. ఇతనిలో మంచి రచయిత కూడా ఉన్నాడు. ప్రస్తుతం నటుడిగా రాణిస్తూనే మరో వైపు పలు టీవీ కార్యక్రమాలకు స్క్రిప్టులు, డైలాగ్స్ అందిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు హరి. ఇదిలా ఉంటే ఎక్స్ ప్రెస్ హరి త్వరలోనే తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడా? పెళ్లితో సరికొత్త లైఫ్‌ను స్టార్ట్ చేయబోతున్నాడా? ఓ తెలుగు సీరియల్ తో కలిసి ఏడడుగులు వేయనున్నాడా? అని నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ హరి రచయితగా, కమెడియన్‌గా కొనసాగుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో విజయవంతంగా 200 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకుంది. ఈ 200వ ఎపిసోడ్‌ను పురస్కరించుకుని తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఎందుకంటే.. ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి ప్రేక్షకులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ హరి త్వరలోనే ఒక ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని శ్రీముఖి పేర్కొంది. ఆ తర్వాత పల్లకిలో ముసుగు వేసుకుని ఉన్న పెళ్లికూతురిని వేదికపైకి తీసుకురావడం, ఎక్స్ ప్రెస్ హరి సిగ్గుపడడం వంటి సన్నివేశాలు చూపించారు. అయితే, ఆ ముసుగులో ఉన్న అమ్మాయి ఎవరనేది స్పష్టంగా చూపించలేదు. దీంతో ఆమె ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే ఈ ప్రోమోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సాధారణంగా టీవీ షోల్లో టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటి పెళ్లిళ్లు చేయడం, లవ్ ట్రాక్స్ ప్లాన్ చేయడం పరిపాటే. ఎక్స్ ప్రెస్ హరి పెళ్లిని కూడా టీఆర్పీ కోసమే వాడుకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే హరి నటుడిగా, రచయితగా వ్యవహరిస్తోన్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ 200వ ఎపిసోడ్ కవాడంతో ఇది నిజమేనని అంటున్నారు. మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే ఈ ఆదివారం (ఆగస్టు 23) ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
టీవీ షోలో యాంకర్ శ్రీముఖితో ఎక్స్ ప్రెస్ హరి..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.