Most Recent

సినిమా ఇండస్ట్రీలో విషాదం.. నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో విషాదం.. నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కృష్ణా జిల్లా, కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. 1976 లో వచ్చిన అంతులేని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు నారాయణరావు. దాదాపు సినిమాలలో పైగా నటించిన నారాయణరావు.. పలు టి.వి.సీరియళ్లలో కూడా నటించారు.

మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నారు నారాయణరావు. రజనీకాంత్,చిరంజీవి కి నారాయణరావు మంచి మిత్రులు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ , చిలకమ్మ చెప్పింది , గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి సినిమాల్లో నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్ళినీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. నారాయణరావు మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.