Most Recent

Bigg Boss Telugu 10: అలాంటి వాళ్లు బిగ్‌బాస్‌కు రావొద్దు.. ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్

Bigg Boss Telugu 10: అలాంటి వాళ్లు బిగ్‌బాస్‌కు రావొద్దు.. ఉప్పల్ బాలు వివాదంపై సంచలన వీడియో రిలీజ్ చేసిన నవదీప్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో సామాన్యుల ఎంపిక కోసం ప్రస్తుత అగ్ని పరీక్ష సీజన్ 2 జరుగుతోన్న సంగతి తెలిసిందే. అభిజిత్, బింధు మాధవి, నవదీప్ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 కు వచ్చిన కంటెస్టెంట్లకు వరుస టాస్కులు ఇస్తూ వారి ట్యాలెంట్‌తో పాటు సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు జడ్జీలు. అయితే ఇదే సమయంలో కొందరు కంటెస్టెంట్ల తో జడ్జీలు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా నవదీప్-ఉప్పల్ బాలు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అగ్ని పరీక్ష జడ్జిల్లో ఒకటైన నవదీప్ తనని అవమానించాడని ఉప్పల్ బాలు వరస పెట్టి వీడియోలు చేస్తున్నాడు. ఒక వేళ తనకు ఏదైనా జరిగితే నవదీప్ కారణమని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. నెటిజన్లు కూడా చాలా మంది బాలుకు సపోర్ట్ చేస్తూ నవదీప్ తీరును ఎండగడుతున్నారు. అయితే తాజాగా ఈ వివాదంపై హీరో నవదీప్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి తనను ట్రోల్ చేసే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

‘బిగ్ బాస్’ అనే ఒక మినీ సైజు సొసైటీ. రకరకాల మైండ్ సెట్ ఉన్న వాళ్లు , యాటిట్యుడ్స్ , ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బ్రతుకుతున్నప్పుడు ఎవరెవరో ఏదేదో అంటారు. అలా అన్నప్పుడు ఆ మాటల్ని ఎలా తీసుకుంటాము? ఎలా రియాక్ట్ అవుతాము? ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాము అనేదే మెయిన్ పాయింట్. దానికి టెస్ట్ నే ఈ అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ కి కేటాయిస్తారు. ఇంటర్నెట్ లో సాధారణంగా ఎదురయ్యే నెగెటివ్ కామెంట్స్ , ట్రోల్స్ ని మేము వాళ్లపై ఉపయోగిస్తాం.
వాటిని వాళ్లు తట్టుకొని ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఈ అగ్ని పరీక్ష షో కాన్సెప్ట్. 100 రోజుల పాటు ఒక మినీ సొసైటీ లో రకరకాల ఎమోషన్స్ ని తట్టుకోగలరా లేదా అనేది మేము చూడాలి. అలా తట్టుకొని ముందుకు వెళ్లే వాళ్లు అనిపిస్తేనే మేము బిగ్ బాస్ లోకి పంపుతాం. దయచేసి ఈ ఫార్మాట్ ని అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమాజానికి ఏం సందేశం ఇస్తావు నువ్వు..అని నాలాంటోళ్లు ఎంతమంది ఎలా మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు , నవ్వుతూ వెళ్లే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్లిపోతావా? అనేది మీ ఇష్టం. హారర్ సినిమాకు వచ్చి భయపెట్టొద్దంటే ఎలా ఎన్ని తిట్టినా భరించే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? నెగిటివ్ కామెంట్స్ ని హ్యాండిల్ చేయలేకపోతే అగ్నిపరీక్షకు దయచేసి రావద్దు’ అని చెప్పుకొచ్చాడు నవదీప్.

నవదీప్ షేర్ చేసిన వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

నవదీప్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనితోనైనా సోషల్ మీడియాలో ఆయనపై నెగెటివిటీ, ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.