
ఇప్పుడు ప్రపంచ మంతా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ఏ రంగంలోనైనా సామాజిక మాధ్యమాలతోనే పని జరుగుతోంది. ముఖ్యంగా ఎంటర్ టైన్మెంట్ రంగంలో దీని ప్రాధాన్యం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే సామాన్యులు కూడా తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ప్రధానంగా ఇప్పుడు అందరూ ఇన్ స్టా రీల్స్ మీద పడిపోయారు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్‌స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. అలాగే తమ క్రియేటివిటీని కూడా చాటి చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన ఇన్ స్టా గ్రామ్ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సమంత సైతం ఈ లేడీ టైలర్ క్రియేటివిటీకి ఫిదా అయిపోయింది. ఆమె వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
ఇటీవల ఉగాది వేడుక సందర్భంగా సమంత-యాంకర్ సుమల సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె హీరోయిన్‌తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేసింది. లేడీ టైలర్ ఎంత పర్ఫెక్ట్‌గా సింక్ చేశారంటే.. ఈ వీడియో చూసే ఎవరికైనా సమంత నేరుగా ఆ టైలర్ తోనే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఈ మహిళా టైలర్ ఎడిటింగ్ అండ్ టైమింగ్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘అచ్చం హీరోయిన్‌తోనే మాట్లాడుతున్నట్లు ఉంది కదా!” అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక దీనిని చూసిన సామ్ కూడా మురిసిపోయింది. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ లైడీ టైలర్ వీడియోను షేర్ చేసి ప్రశంసలు కురిపించింది.
సమంతను మెప్పించిన లేడీ టైలర్ ఇన్ స్టా గ్రామ్ రీల్ ఇదే..
సమంతను మెప్పించిన రీల్
సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్‌ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs
— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.