Most Recent

ఓ మై గాడ్.. అన్నా.. ఇది నువ్వేనా..! మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?

ఓ మై గాడ్.. అన్నా.. ఇది నువ్వేనా..! మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వారణాసి అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కితున్నారు రాజమౌళి. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. అంతే కాదు రకరకాల గెటప్స్ లో మహేష్ కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే మహేష్ బాబు రాముడిగా కనిపించనున్నారని రాజమౌళి లీక్ చేశారు. దాంతో అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ సినిమా హైప్ ను పెంచేసింది. ఇదిలా ఉంటే మహేష్ బాబుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పై ఫోటో చూశారా.? అది మహేష్ బాబు నటించిన ఓ సినిమాలోని ఫోటో.. అందులో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? చాలా ఫెమస్ ఆయన. మహేష్ బాబు నటించిన సినిమాలో ఆయన ఫ్రెండ్ గా నటించాడు. ఇప్పుడు టాలీవుడ్ లో దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆయన ఎవరో తెలుసా.? పై ఫొటోలోఉన్న వ్యక్తి మరెవరో కాదు దర్శకుడు మెహర్ రమేష్. అవును ఆయనే.. నమ్మడం కాస్త కష్టమే అయినా.. అది ఆయనే..

మహేష్ బాబు నటించిన బాబీ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించారు మెహర్ రమేష్. బాబీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో మెహర్ నటుడిగా ఆతర్వాత ఎక్కడ కనిపించలేదు. దర్శకుడిగా మారి సినిమాలు చేస్తున్నారు. మహేష్ బాబుకు, మెహర్ రమేష్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఆయన ఎప్పుడూ మహేష్ పక్కనే కనిపిస్తూ ఉంటారు. కాగా మెహర్ రమేష్ తీసిన సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ.. చివరిగా మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ అనే సినిమా చేశారు ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే మెహర్ ప్రస్తుతం ఓ యంగ్ హీరోతో సినిమా చేసే పనిలో ఉన్నారంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Meher Raamesh (@meherramesh)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.