Most Recent

Tollywood: ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వి.ఎన్.ఆదిత్య

Tollywood: ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వి.ఎన్.ఆదిత్య

తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ సినీ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఘన విజయం సాధించారు. అసోసియేషన్ ఎన్నికల్లో వి.ఎన్. ఆదిత్య నేతృత్వంలోని ప్యానెల్ 18 స్థానాలకు గాను 16 స్థానాలను కైవసం చేసుకుంది. డైరెక్టర్స్ అసోసియేషన్ సమగ్ర అభివృద్ధికి తమ ప్యానెల్ కృషి చేస్తుందని చెప్పారు వీఎన్ ఆదిత్య. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు.

తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కమిటీ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించింది. అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని.. ప్రధాన కార్యదర్శిగా పి. రవి, ట్రెజరర్‌గా రవీందర్ గెలుపొందారు. జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు వారికి ఇండస్ట్రీలో మెరుగైన వేతనాలు, అవకాశాలు, షూటింగ్ స్పాట్‌లలో కనీస సదుపాయాలు కల్పించేలా చూస్తామన్నారు. తమ ప్యానెల్‌పై నమ్మకం ఉంచి గెలిపించిన యూనియన్ సభ్యులందరికీ నూతన కార్యవర్గం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.