Most Recent

బాలయ్యబాబా మజాకా.. ఆ హీరోయిన్‌తో ఏకంగా 16 సినిమాలు.. అప్పట్లో ఊపేసిన జంట

బాలయ్యబాబా మజాకా.. ఆ హీరోయిన్‌తో ఏకంగా 16 సినిమాలు.. అప్పట్లో ఊపేసిన జంట

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డాకు మహారాజ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ డేస్‌లో బాలయ్య నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. టాలీవుడ్ లో టాప్ హీరోగా దూసుకుపోతున్నారు బాలయ్య. ఇటీవల వరుసగా 5 సినిమాల హిట్స్ తో రాణిస్తున్నారు బాలకృష్ణ. చివరిగా అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.

ఇదిలా ఉంటె బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు బాలయ్య. అయితే బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. విజయశాంతి బాలకృష్ణతోనూ చాలా సినిమాలు చేశారు.

బాలయ్య బాబుతో కలిసి ఏకంగా 16 సినిమాల్లో నటించారు విజయశాంతి. అప్పటిలో ఈ జంటకు సపరేట్ ఫ్యాన్స్ ఉండేవారు. బాలయ్య బాబుతో చివరిగా నిప్పురవ్వ సినిమాలో నటించారు విజయశాంతి. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. దీని పై గతంలో విజయశాంతి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారితో నటించపోవడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. నిప్పురవ్వ తర్వాత నేను వేరే సినిమాల్లో బిజీ అయ్యాను. అదే సమయంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఆ సమయంలో నాకు వచ్చిన కథలన్నీ అలాంటివే అందుకు బాలకృష్ణతో నటించడం కుదరలేదు. అంతకు మించి ఏం లేదు అని అన్నారు విజయశాంతి.

Vijayshanthi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.