Most Recent

Mayank Pawar: 7 సార్లు మిస్టర్ ఇండియా.. 37 ఏళ్ల వయసులో హఠాన్మరణం.. అసలు ఎవరీ మయాంక్ పవార్‌?

Mayank Pawar: 7 సార్లు మిస్టర్ ఇండియా.. 37 ఏళ్ల వయసులో హఠాన్మరణం.. అసలు ఎవరీ మయాంక్ పవార్‌?

స్ప్లిట్స్‌విల్లా 7 ఫేమ్ నటుడు మయాంక్ పవార్ కన్నుమూశాడు. కేవలం 37 సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. అతని ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు అతని అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. MTV స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7లో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్స్ లో మయాంక్ ఒకరు. ఇటీవలే ఆయన తన పుట్టిన రోజును జరుపుకొన్నారు. అంతలోనే ఈ తీవ్ర విషాదం జరిగింది. మయాంక్ హఠాన్మరణం పట్ల పలువురు బుల్లితెర ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే మయాంక్ మరణానికి ఖచ్చితమైన కారణం తెలియరావడం లేదు. మయాంక్ పవార్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు.. ‘సోదరుడు, ఛాంపియన్, గురువు, చాలా మందికి స్ఫూర్తిదాయకమైన మయాంక్ పవార్ ఎల్లప్పుడూ మన హృదయాల్లో నిలిచి ఉంటారు. ఫిబ్రవరి 25, 2026న సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రాణా ప్రతాప్ బాగ్‌లోని సంగం పార్క్‌లోని వాల్మీకి ఆలయంలో సంతాప సమావేశం జరుగుతుంది’ అని వెల్లడించారు.

మయాంక్ జనవరి 1, 1989న జన్మించాడు. ఇటీవలే తన 37వ పుట్టినరోజును జరుపుకొన్నాడు. ఇప్పుడు అతని మరణ వార్త విన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. ‘నేను కొన్ని రోజుల క్రితం నేను అతని స్ప్లిట్స్‌విల్లా ప్రయాణాన్ని చూస్తున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. స్ప్లిట్స్‌విల్లాలో ఇంత మంచి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ ఏడ్చారు, సన్నీ లియోన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎమోషనల్ అవుతున్నారు.

ఏడు సార్లు మిస్టర్ ఇండియాగా..

మయాంక్ పవార్ ఫిట్‌నెస్ ప్రపంచంలో బాగా ప్రాచుర్యం పొందారు. అతను ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నాడు. అలాగే మిస్టర్ ఆసియా టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. బాడీబిల్డింగ్, ఫిట్‌నెస్ రంగాల్లో అతని విజయాలను చూసి చాలామంది మయాంక్ ను స్ఫూర్తిగా తీసుకున్నారు. మరీ ముఖ్యంగా స్ప్లిట్స్‌విల్లా 7 ద్వారా పవార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ షోలో అతని ఆట తీరు సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కట్ట పడేసింది. మయాంక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ షోలో అత్యంత చర్చనీయాంశమైన ఎపిసోడ్‌లలో ఒకటి. మయాంక్ విల్లా నుంచి బయటకు వెళుతుండగా, హోస్ట్ సన్నీ లియోన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. మయాంక్ ను హగ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో నెట్టింట బాగా వైరలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.