
ఈమె మాత్రం ఇంట్లోనే కేవలం 20 సెకన్లలో చేసుకునే ఒక పవర్‌ఫుల్ టిప్‌ను పరిచయం చేసింది. అది కేవలం బరువు తగ్గడానికే కాదు, మీ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందట. పవర్‌ఫుల్ లెగ్ కిక్స్‌తో ఆమె చేస్తున్న ఆ సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫిట్‌నెస్ ఫ్రీక్ మరెవరో కాదు.. భాగ్యశ్రీ. ఆమె తాజాగా పంచుకున్న కిక్-బేస్డ్ కార్డియో విశేషాలేంటో తెలుసుకుందాం.
భాగ్యశ్రీ మ్యాజిక్ మంత్ర..
ఫిబ్రవరి 10, 2026న భాగ్యశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె చాలా ఎనర్జిటిక్‌గా లెగ్ కిక్స్ చేస్తూ కనిపించింది. “ఏడాది ఇప్పుడే మొదలైంది.. ఆరంభించండి” అంటూ తన ఫాలోవర్లలో స్పూర్తిని నింపింది. ఈ కిక్-బేస్డ్ వార్మ్-అప్ వల్ల కేవలం శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ఉత్తేజితం అవుతుందని ఆమె వెల్లడించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇది సూపర్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
భాగ్యశ్రీ చేస్తున్న ఈ వ్యాయామంపై ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కిక్-బేస్డ్ కార్డియో వల్ల శరీరంలో మెటబాలిజం (జీవక్రియ) వేగవంతం అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇలాంటి కదలికల వల్ల మెదడులో కొత్త న్యూరోట్రాన్స్‌మిటర్స్ తయారవుతాయి. దీనివల్ల ఏకాగ్రత, శరీర బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ అద్భుతంగా పెరుగుతాయి. అంటే ఇది కేవలం ఫిజికల్ వర్కవుట్ మాత్రమే కాదు, మెంటల్ హెల్త్ బూస్టర్ కూడా! ఈ వ్యాయామం శరీరంలోని క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. జ్ఞాపకశక్తి, ఫోకస్ పెరగడానికి తోడ్పడుతుంది. పిరుదులు, కాళ్లకు మంచి దృఢత్వాన్ని ఇస్తుంది. గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సహజంగానే శక్తిని ఇచ్చి రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది.
View this post on Instagram
ఎలా చేయాలి?
దీని కోసం మీరు జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే నిలబడి, కాళ్లు కొద్దిగా వెడల్పుగా ఉంచి, మోకాలు స్ట్రెయిట్‌గా ఉంచుతూ ఒక్కొక్క కాలిని ముందుకు లేదా పక్కకు శక్తివంతంగా కిక్ చేయాలి. ఇలా మార్చి మార్చి ఒకటి నుంచి రెండు నిమిషాలు చేస్తే చాలు.. మీ శరీరం వర్కవుట్ కోసం పూర్తిగా సిద్ధమవుతుంది. ఏదైనా పూర్తిస్థాయి వ్యాయామం చేసే ముందు దీనిని వార్మ్-అప్‌లా ఉపయోగించాలని భాగ్యశ్రీ సూచిస్తోంది. 56 ఏళ్ల వయసులో భాగ్యశ్రీని చూస్తుంటే ఫిట్‌నెస్‌కు వయసుతో సంబంధం లేదని అర్థమవుతుంది. కేవలం 20 సెకన్ల సమయం కేటాయించి ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆమె నిరూపించింది.