Most Recent

Aishwarya Rai: ఐష్ పుట్టిన రోజు నేడు.. నెదర్లాండ్స్‌లోని ఒక పువ్వుకు ఈ బాలీవుడ్ నటి పేరు..

Aishwarya Rai: ఐష్ పుట్టిన రోజు నేడు.. నెదర్లాండ్స్‌లోని ఒక పువ్వుకు ఈ బాలీవుడ్ నటి పేరు..

ఎవరి అందం గురించి అయినా మాటల్లో వర్ణించాలంటే ఉర్దూ కవులు, వారు రాసిన కథలు తరచు గుర్తొస్తాయి. అయితే చలన చిత్రసీమలో అందాన్ని మాటల్లో వర్ణించలేని వ్యక్తులు కొందరు ఉన్నారు. మధుబాల అందం, గాంభీర్యం గురించి అలనాటి వ్యక్తులు చెబితే.. నేటి తరం వారు ఐశ్వర్యరాయ్ బచ్చన్ అందం గురించి చెబుతారు. ఈరోజు ఐశ్వర్య పుట్టినరోజు. ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 నవంబర్ 1973న కర్ణాటకలోని మంగళూరులో మెరైన్ ఇంజనీర్ కృష్ణరాజ్ రాయ్ , రచయిత్రి బృందా రాయ్ దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య రాయ్. ఐశ్వర్యకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు, అతని పేరు ఆదిత్య. ఐష్ తన రచయిత తల్లి నుంచి అనేక విషయాలను నేర్చుకుంది. మంచి నడవడిక, విలువలు చిన్నతనం నుండే అలవడ్డాయి. కర్ణాటకలో జన్మించిన ఐష్ తెలుగు భాషను చక్కగా స్పష్టంగా మాట్లాడుతుంది. అంతేకాదు ఆమెకు కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ , తమిళం కూడా తెలుసు. ఐశ్వర్య రాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జరిగింది. తర్వాత ఐశ్వర్య రాయ్ కుటుంబం ముంబైలో స్థిరపడింది. ముంబైలో ఆర్య విద్యా మందిర్, శాంతా క్రజ్, తరువాత మాతుంగాలో విద్యనభ్యసించింది.

మొదటి మోడలింగ్ ఉద్యోగం

ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్‌కు కూడా చేసింది. ఐస్వర్య చిన్నప్పటి నుంచి చాలా అందంగా ఉండేది. నీలి కళ్ళు, చురుకైన ముఖం.. ముఖంలో భిన్నమైన గ్లోతో అందరినీ ఆకట్టుకుంది. చదువుతో పాటు మోడలింగ్ కూడా చేసింది. ఐష్ తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు క్యామ్లిన్ కంపెనీలో మొదటి మోడలింగ్ ఉద్యోగం సంపాదించింది. దీని తర్వాత ఐష్ కోక్, ఫ్రూటీ, పెప్సీలకు యాడ్స్ కూడా చేసింది. మోడలింగ్ చేసే సమయంలో మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది. ప్రతి మైలురాయిని దాటుతూనే ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచింది. ఐశ్వర్య అదే ఏడాది మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది.

హై స్కూల్ లో చదువుతున్నప్పుడే రేఖను కలిసిన ఐష్..

మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఐష్ దేశంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. మిస్ వరల్డ్ తర్వాత ఐష్ దేశంలో మాత్రమే కాదు విదేశీయులకు కూడా పరిచయం అయ్యింది. ఐశ్వర్య ను చూడడం కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడేవారు. అయితే ఐశ్వర్య మొదటిసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖను కలిసిందని మీకు తెలుసా.. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఐశ్వర్య హైస్కూల్‌లో ఉన్నప్పుడు మోడల్‌గా చేసే సమయంలో రేఖను మొదటిసారి కలుసుకుంది. ఐశ్వర్య తన తల్లితో ఒక కిరాణా దుకాణంలో ఉన్న సమయంలో ఐశ్వర్య వెనుక నుండి రేఖ భుజం మీద తట్టింది. రేఖ తన మోడలింగ్ ప్రకటనలలో నటించిన ఐశ్వర్య ను గుర్తించింది. అయితే ఐష్ కు భవిష్యత్తులో తాను కూడా అద్భుతమైన నటిగా ఎదుగుతానని అప్పట్లో ఊహించి ఉండదు.

ఆ దిగ్గజ జంట ‘హమ్ దిల్ దే చుకే సనమ్’

1994లో ఐష్ తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. అది కూడా దక్షినాది సినిమాలో నటించింది. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తెరక్కిన తమిళ చిత్రం ఇరువర్‌లో పని చేసింది. అదే సంవత్సరంలో ‘ఔర్ ప్యార్ హో గయా’తో హిందీ చలనచిత్ర రంగంలోకి ప్రవేశం చేసింది. దీని తర్వాత ఐశ్వర్య జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సంవత్సరం 1999లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఐశ్వర్య కెరీర్ కు టర్నింగ్ పాయింట్ సినిమా. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్ లు హీరోలుగా నటించారు. తెరపై నందిని వనరాజ్‌ని ఎంచుకున్నప్పటికీ.. తెర వెనుక వేరే జంట అంటే సల్మాన్, ఐష్ డేటింగ్ గురించి చర్చ జోరందుకుంది. తర్వాత ఐష్ పేరు అతని సహనటుడు వివేక్ ఒబెరాయ్‌తో ముడిపడి ఫిల్మ్ నగర్ లో రేంజ్ లో చక్కర్లు కొట్టింది.

ఐశ్వర్య గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయాలు ఏమిటంటే

2004లో లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని ఉంచిన తొలి బాలీవుడ్ , భారతీయ నటి ఐశ్వర్య.

ఏప్రిల్ 2003లో ఖాకీ చిత్రం షూటింగ్‌ సమయంలో పెద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య కాలులో ఎముక విరిగాయి.

మరుసటి సంవత్సరం 2004లో ఐష్ ఒలింపిక్ టార్చ్ రిలేలో పాల్గొని టార్చ్‌ని పట్టుకుంది.

వాచీలంటే తనకు చాలా ఇష్టమని ఐష్ ఎప్పుడూ చెబుతుంది.

యాష్‌పై ప్రజల్లో ఎంత క్రేజ్ ఉందంటే.. 2006లో ఓ సోప్ యాడ్ షూటింగ్ సమయంలో దుబాయ్‌లో రోజంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఆమె దర్శనం కోసం ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నారు.

‘రోలింగ్ స్టోన్’ మ్యాగజైన్‌లో కనిపించిన మొదటి నటి ఐష్. న్యూజిలాండ్‌లోని తులిప్ పువ్వుకు కూడా ఐశ్వర్య రాయ్ పేరు పెట్టారు.

హిందీ సినిమాకి ఆమె చేసిన కృషికి భారత ప్రభుత్వం నుండి నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు ఐష్.

ఐష్ తరచుగా అనేక అనాథాశ్రమాలను సందర్శిస్తుంది..తరచుగా పెద్ద విరాళాలు ఇస్తుంది.

1998 చిత్రం కుచ్ కుచ్ హోతా హైలో రాణి ముఖర్జీ పాత్ర టీనా పాత్రను మొదట ఐష్‌కు ఆఫర్ చేశారు. అయితే ఐశ్వర్య రాయ్ ఆ పాత్రను తిరస్కరించింది.

IMDB ప్రకారం అత్యధిక ఫోటోలు తీసిన భారతీయ మహిళ ఐశ్వర్య రాయ్.

 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.