ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు, నేర్చుకునేందుక ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే కమల్ లోక నాయకుడు అయ్యారు. ఈ మాటను మరోసారి నిరూపించుకుంటూ ఇప్పుడు కమల్ హాసన్ కొత్త టెక్నాలజీ నేర్చుకునేందుకు అమెరికా వెళ్లాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు తీసుకురానుందని అంటున్నారు. మీరు ఏమీ నేర్చుకోకపోయినా, మీరు కృత్రిమ మేధస్సు లేదా AI భాష నేర్చుకోవాలంటేపకపానే. ఈనేపథ్యంలో ఏఐ సబ్జెక్టును నేర్చుకునేందుకు కమల్ హాసన్ అమెరికా వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లో 90 రోజుల AI కోర్సు కోసం తన పేరును రిజిస్టర్ చేయించుకున్నారు. ప్రత్యేకంగా ఈ కోర్సు కోసమే కమల్ హాసన్ ఇప్పటికే అమెరికా వెళ్లగా, మరో 45 రోజుల పాటు అక్కడే ఉండి ఏఐ కోర్సును నేర్చుకోనున్నారు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రానున్నారు. 45 రోజుల పాటు షూటింగ్ వర్క్ లేకపోవడంతో కమల్ హాసన్ ఏఐ కోర్సులో చేరారు. ఇది పూర్తయిన తర్వాత మళ్లీ ఇండియా వచ్చి రెగ్యులర్ గా షూటింగుల్లో పాల్గొననున్నాడు.
కమల్ హాసన్ ఎప్పటినుంచో టెక్నాలజీలో దూసుకుపోతున్నారు. ఇంతకు ముందు తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో కెమెరా, సౌండ్, ఎడిటింగ్ తదితర అనేక కొత్త టెక్నాలజీలను ఉపయోగించారు. ఇంతకుముందు కమల్ హాసన్ మేకప్ మీద చాలా ఆసక్తి పెంచుకుని హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ మేకప్ మేన్ దగ్గర మేకప్ నేర్చుకోడానికి వెళ్లడమే కాకుండా మొదటి ‘రాంబో’ సినిమాకు మేకప్ అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కమల్ ఇప్పుడు AI నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కమల్ తన సినిమాల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
కాగా కమల్ హాసన్ ఇటీవల నటించిన భారతీయుడు 2 సినిమా అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ మొదటి పార్ట్ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. అయితే ప్రభాస్ తో కలిసి కమల్ నటించిన కల్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆయన పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. కల్కి రెండో పార్ట్ లో కమల్ హాసన్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని సమాచారం.
முத்தமிழறிஞர் கலைஞர் நூற்றாண்டு நினைவு நாணயம் வெளியீட்டு விழாவுக்கு அழைக்கப்பட்டிருந்தேன். முன்னரே ஒப்புக்கொண்ட பணிகளால் அந்த வரலாற்றுச் சிறப்பு மிக்க விழாவில் கலந்துகொள்ள இயலவில்லை.
நவீனத் தமிழகத்தை நிர்மாணித்தவரும், இந்திய அரசியலில் மாபெரும் சக்தியாக விளங்கியவரும், வாழ்நாள்… pic.twitter.com/jp71vihQga
— Kamal Haasan (@ikamalhaasan) August 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.