-
ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో యువతరానికి కంటి నిండ నిద్ర పోవడం లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ప్రతిరోజూ 7 నుంచి 9 తప్పనిసరిగా ఉండాలి.. అలా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. నిద్ర లేమి వల్ల కలిగే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
-
నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేసి బాగా ఆకలేస్తుంది. దీనివల్ల బరువు పెరిగి ఊబకాయం సమస్య ఏర్పడుతుంది. అంతే కాకుండా దీర్ఘకాలిక నిద్ర లేమి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.
-
నిద్ర లేమి సమస్య వల్ల గుండె కొట్టుకునే స్థితి గతులు మారుతుంది.. ఇది హార్ట్‌స్ట్రోక్‌కు దారితీస్తుంది. అంతే కాకుండా గుండెలో మంట ఏర్పడి గుండె జబ్బులను పెంచేందుకు కారణం అవుతుంది.
-
నిద్రలేమి సమస్య క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుంది. తద్వారా వారు చేసే పనిపై ఎక్కువగా దృష్టి పెట్టలేరు. అంతే కాకుండా నిద్రలేమి సమస్య వల్ల శరీరం లో నిసత్తువగా ఉంటుంది.
-
నిద్రలేమి సమస్య శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా శరీరం లో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది.