యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కెరీర్ ప్రారంభించిన సినిమా ఈశ్వర్. 22 ఏళ్ల క్రితం ఈ మూవీతోనే వెండితెరకు నటుడిగా పరిచయమైన డార్లింగ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ నటించింది. ఆమెకు కూడా ఇది మొదటి సినిమా కావడం విశేషం. వీరిద్దరి జోడికి అప్పట్లో మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. వీరిద్దిర పెయిర్ ను ఇప్పటికీ జనాలు మర్చిపోలేరు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇక ఈసినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. కొంతకాలానికే ఇండస్ట్రీకి దూరమయ్యింది. తెలుగుతోపాటు తమిళంలోనూ కథానాయికగా అలరించిన ఆమె పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది.
చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది శ్రీదేవి. బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జీగా వ్యవహరించిన శ్రీదేవి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సుందరకాండ సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వస్తుంది శ్రీదేవి. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. 2002లో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ తార.. ఇప్పుడు 22 ఏళ్లకు మళ్లీ వెండితెరపై సందడి చేయబోతుంది. 2011లో వీర సినిమాలో రవితేజ చెల్లిగా కనిపించింది. ఆ తర్వాత 2016లో కన్నడంలో లక్షణ సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు అనుహ్యంగా నారా రోహిత్ సరసన నటించనుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మొదటి సినిమా నుంచి అందరూ ప్రభాస్ ను డార్లింగ్ అని పిలుస్తారని.. ఈశ్వర్ సినిమా టైంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని తెలిపింది. ఇన్ని సంవత్సరాలలో ప్రభాస్ కొంచెం కూడా మారలేదని.. ప్రభాస్ తో మళ్లీ నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. కానీ క్యారెక్టర్ కంటే సినిమా కంటెంట్ బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తమ ఫస్ట్ మూవీ ఈశ్వర్ రీరిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నట్లు తెలిపారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే.. ఈ సందర్భంగా ఈశ్వర్ సినిమాతోపాటు డార్లింగ్ మూవీని కూడా రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.