బాలీవుడ్ బాద్ షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో నటించే అవకాశం వస్తే చాలా మంది నటీమణులు కళ్లు మూసుకుని అంగీకరిస్తారు. షారుక్ హవా అలాంటిది. అయితే నటి రవీనా టాండన్ మాత్రం షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించేందుకు నో చెప్పింది. అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు గతంలో. ఇటీవల రవీనా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. షారుఖ్ ఖాన్, రవీనా టాండన్ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. కానీ రవీనా టాండన్ ఏమాత్రం ఒక సినిమాలో షారుఖ్ ఖాన్ తో నటించేందుకు నో చెప్పింది. అది ఏ సినిమా అన్నది రవీనా టాండన్ వెల్లడించలేదు. అయితే ఏం జరిగిందో వివరించింది ఆ సినిమా కథ రవీనా టాండన్‌కి నచ్చింది. సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే సమస్యంతా దుస్తులతోనే వచ్చింది అవును, రవీనా టాండన్ తనకు సరిపోని కాస్ట్యూమ్ వేసుకోమని చెప్పడంతో షారుఖ్ సినిమా నుంచి తప్పుకుంది. ‘ఆ దుస్తులు చాలా తేడాగా అనిపించాయి. ఇవి కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయనిపించింది. దీంతో సారీ, నేను చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేశాను’ అని చెప్పుకొచ్చింది రవీనా.
ఆ తర్వాత తన సమస్యను షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి చెప్పింది. షారుక్‌కి కూడా సమస్య అర్థమైంది. అందుకే రవీనా టాండన్ షారుఖ్‌ను జెంటిల్మెన్ అని పిలిచింది. 1995లో జమానా దివాన సినిమాలో షారుఖ్, రవీనా టాండన్ కలిసి నటించారు. వీరిద్దర మొత్తంగా నాలుగు సినిమాలు కలిసిచేశారు. అయితే, తాను ఓ మూవీ తిరస్కరించానని తాజాగా వెల్లడించిన రవీనా. ఆఈ మూవీ ఏదో వివరాలు మత్రం చెప్పలేదు. అలాగే, ఇతర కారణాల వల్ల, రవీనా టాండన్ షారుఖ్‌తో సినిమాను తిరస్కరించింది. 1993లో షారుఖ్ ఖాన్ సినిమా ‘దార్’ విడుదలైంది. ఆ చిత్రానికి యష్ చోప్రా దర్శకత్వం వహించారు. ఆ సినిమాలో నటించేందుకు రవీనా టాండన్‌కు ఆఫర్ వచ్చింది. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలు తనకు సరిగా అనిపించకపోవడంతో ఆ ఆఫర్‌ను రవీనా టాండన్ తిరస్కరించింది. ఆ తర్వాత జూహీ చావ్లా ఆ పాత్రను పోషించింది.
మూవీ ప్రమోషన్లలో రవీనా టాండన్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.