-
10 జనవరి 1990న తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ తెలుగు కుటుంబంలో జన్మించింది అందాల తార ఐశ్వర్య రాజేష్. ఆమె తండ్రి రాజేష్ తెలుగు సినిమా నటుడు. ఐశ్వర్య చిన్నతనంలోనే చనిపోయాడు. ఆమె తల్లి నాగమణి నృత్యకారిణి.
-
ఈ వయ్యారి తల్లిదండ్రుల నలుగురు సంతంలో ఆమె చిన్నది. వీరిలో ఇద్దరు అన్నలు ఆమె యుక్తవయస్సులో మరణించారు. ఆమె తాత అమర్నాథ్ కూడా తెలుగు సినిమా నటుడు. ఆమె అత్త శ్రీ లక్ష్మి 500 పైగా తెలుగు చిత్రాల్లో హాస్యనటిగా చేసింది.
-
తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్లో, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివింది.తమిళనాడులో చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బి.కామ్ లో డిగ్రీ పట్ట పొందింది ఈ వయ్యారి భామ.
-
పేరుకు తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ చిత్రాల్లో మాత్రమే నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఆమె స్టార్. 2019లో స్పోర్ట్స్ డ్రామా కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
-
ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ఓ తెలుగు సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. దీంతో పాటు కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగ అనే తమిళ సినిమాలతో పాటు అజయంతే రాండమ్, హేర్ అనే మలయాళీ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే ఉత్తరాఖండ అనే ఓ కన్నడ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది.