Most Recent

Aditi Rao Hydari: సిద్దార్థ్ నాకు అక్కడే ప్రపోజ్ చేశాడు.. పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అదితిరావు

Aditi Rao Hydari: సిద్దార్థ్ నాకు అక్కడే ప్రపోజ్ చేశాడు.. పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన అదితిరావు

సిద్దార్థ్‌తో అదితిరావు ప్రేమాయణం నడుపుతున్న విషయం అందరికి తెలిసిందే. మొన్నామధ్య ఈ ఇద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. టాలీవుడ్ లో హీరో సిద్దార్థ్‌ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. లవర్ బాయ్ గా అలరించాడు సిద్దార్థ్‌. బాయ్స్ సినిమా దగ్గర నుంచి నువస్తానంటే నేనొద్దంటానా.., బొమ్మరిల్లు, కొంచం ఇష్టం కొంచం కష్టం ఇలా చాలా సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అలాగే తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక అదితి రావు హైదరి తెలుగులో సమ్మోహనం సినిమాతో పరిచయం అయ్యింది. సుదీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత సిద్దార్థ్‌తో కలిసి మహాసముద్రం అనే సినిమా చేసింది. ఈ సినిమా టైం లోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: ఎంతమందిని దింపుతార్రా బాబు..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరో క్రేజీ బ్యూటీ

మహాసముద్రం సినిమా తర్వాత సిద్దార్థ్‌ అదితి చాలా సార్లు కలిసి మీడియా కంట పడ్డారు. దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ టాక్ వినిపించింది. కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ ఇద్దరు తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. తాజాగా అదితి రావు మాట్లాడుతూ.. ప్రేమ , పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు వాళ్ల నానమ్మ అంటే చాలా ఇష్టమని తెలిపిన అదితి.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపింది.

ఇది కూడా చదవండి : Prasad Behara : అన్నం తింటుంటే బూతులు తిట్టి గెంటేశారు.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు

అలాగే స్కూల్లో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి ఎక్కడ జరగబోయేది అనే విషయాలుకు బయట పెట్టింది. అదితి మాట్లాడుతూ .. మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మాకు హైదరాబాద్ లో ఓ స్కూల్ ఉంది. నేను చిన్నప్పుడు ఎప్పుడు అక్కడే ఉండేదాన్ని. ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం నాకు. కొన్నాళ్ల క్రితం మా నానమ్మ కన్నుమూశారు. ఓ రోజు సిద్దార్థ్‌ వచ్చి నన్ను ఆ స్కూల్ కు తీసుకెళ్లామని చెప్పాడు. అక్కడ మోకాళ్ళ పై కూర్చొని నాకు ప్రపోజ్ చేశాడు. మా నాన్నమ్మ ఆశీసులకోసమే అక్కడ ప్రపోజ్ చేశానని సిద్దార్థ్‌ చెప్పాడు. తాను ప్రపోజ్ చేసిన తీరు ఎంతో నచ్చిందని తెలిపింది అదితి. అలాగే శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతుందని కూడా చెప్పుకొచ్చింది. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాత ప్రకటిస్తానని తెలిపింది అదితి రావు. అయితే ఈ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.