బుల్లితెరపై యాంకరింగ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన శివకార్తికేయన్.. ఇప్పుడు హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. గత పదేళ్లలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు దాదాపు 20 సినిమాల్లో నటించి అలరించాడు. శివకార్తికేయన్ సినిమాలు సూపర్ హిట్స్ కావడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అయితే వెండితెరపైనే కాదు..నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నాడు శివకార్తికేయన్. సినిమా విడుదల సమయంలో నిర్మాతలు అనేక సమస్యలతో ఇబ్బందిపడ్డారు. దీంతో తన రెమ్యునరేషన్ వద్దన్నాడు. ఒకటి కాదు.. రెండు సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పనిచేశాడు. మరి శివకార్తికేయన్ ఏ సినిమాల కోసం తన పారితోషికాన్ని త్యాగం చేశాడో చూద్దాం.
శివకార్తికేయన్, దర్శకుడు పొన్‌రామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా రజనీ మురుగన్. 2016లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ సినిమా విడుదలలో చాలా సమస్యలు వచ్చాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా విడుదల కోసం శివకార్తికేయన్ తన పారితోషికంలో కొంత భాగాన్ని త్యాగం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ చిత్రం క్రిటికల్‌గానూ, బాక్సాఫీస్ వద్దనూ భారీ విజయాన్ని అందుకుంది.
View this post on Instagram
ఇక ఇప్పుడు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రవికుమార్ తెరకెక్కించిన సినిమా అయాలన్. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈసినిమా ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తోంది చిత్రయూనిట్. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించాడు. ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న నిర్మాతలు.. అయాలన్ విడుదల చేయాలా ? వద్దా? అనే సందేహంలో పడ్డారట.ఆ సమయంలో శివకార్తికేయన్ తనకు సినిమా విడుదలైతే చాలని.. పారితోషికం వద్దని అన్నారట. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ తో ఈ మూవీపై మరింత క్యూరియాసిటి ఏర్పడింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.