Most Recent

Shruti Haasan: మద్యపానం పెద్ద వ్యసనం.. తాగుడు అలవాటుపై తొలిసారి రియాక్ట్ అయిన శ్రుతి.. ఏం చెప్పిందంటే..

Shruti Haasan: మద్యపానం పెద్ద వ్యసనం.. తాగుడు అలవాటుపై తొలిసారి రియాక్ట్ అయిన శ్రుతి.. ఏం చెప్పిందంటే..

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్లలో శ్రుతి హాసన్ ఒకరు. ఆమె సినీ ప్రపంచంలో టాప్ హీరో అయిన లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కూతురిగా సినీ అరంగేట్రం చేసింది. నటన, సంగీతం, గానంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ బ్యూటీకి అంతగా కలిసిరాలేదు. దీంతో అప్పటి నుంచి తెలుగు సినిమాలపైనే దృష్టి సారించింది. ఆమె చివరిసారిగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్లో కనిపించింది. ఇక ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన సలార్ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతిహాసన్.. కొన్నేళ్ల క్రితం మద్యానికి బానిసైన విషయం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తాన రోజూ పార్టీలకు వెళ్లి మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉందని తెలిపింది. కానీ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది. “ఎప్పుడూ స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లి మద్యం తాగడం అలవాటు చేసుకున్నాను. కానీ ఈ వ్వసనం నుంచి బయటపడాలని అనుకున్నాను. అందుకు ముందుగా పార్టీలకు ఆహ్వనించే స్నేహితులకు దూరంగా ఉన్నాను. దాదాపు ఎనిమిదేళ్లుగా ఆల్కహల్ కు దూరంగా ఉంటున్నాను. జీరో రిగ్రెట్.. జీరో హ్యాంగ్ ఓవర్స్ తో హుందాగా ఉన్నాను. జీవితంలో ఎప్పుడూ తాగకూడదని డిసైడ్ అయ్యాను.హుందాతనంగా ఉన్నాను. మద్యం అలవాటు గురించి చెప్పి.. నన్ను అవమానపరచడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు జీవితం బాగుంది.” అంటూ చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్.

క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది శ్రుతిహాసన్. ఆ తర్వాత సలార్ చిత్రంలో నటించింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. ఇక ఇటీవలే విడుదలైన హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. అలాగే టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తోన్న కొత్త మూవీలోనూ నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.