Most Recent

Salaar Twitter Review: గూస్‏బంప్స్ ఇంటర్వెల్.. క్లైమాక్స్ ఊరమాస్.. మెంటల్ ఎక్కించిన ప్రశాంత్ నీల్..

Salaar Twitter Review: గూస్‏బంప్స్ ఇంటర్వెల్.. క్లైమాక్స్ ఊరమాస్.. మెంటల్ ఎక్కించిన ప్రశాంత్ నీల్..

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఇన్నాళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత ఊరమాస్ యాక్షన్ సినిమాతో ప్రభాస్ వస్తుండడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ 1, 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం.. యంగ్ రెబల్ స్టార్ నటించిన ఈ సినిమాకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది. బాహుబలి హిట్ తర్వాత ఇన్నాళ్లకు డార్లింగ్ ఫ్యాన్స్‏కు ఫుల్ మీల్స్ అందించాడు నీల్. ఈరోజు అర్ధరాత్రి నుంచి సలార్ స్పెషల్ షోస్ చూసిన ఫ్యాన్స్ మూవీ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. డార్లింగ్ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ కట్అవుట్.. నీల్ డైరెక్షన్ పై పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న గ్రాండ్‏గా విడుదలైంది. ఇప్పటికే స్పెషల్ షోస్ చూసిన ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ హిట్.. ప్రభాస్ కు నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లకు డార్లింగ్‏ను స్క్రీన్ పై యాక్షన్ హీరోగా చూసి ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్.

టీజర్, ట్రైలర్, పాటలతోనే ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాడు నీల్. ఇక తాజాగా విడుదలైన సినిమా వేరేలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శితమయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ స్పెషల్ షోస్ వేశారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. ‘సలార్’ మెంటల్ మాస్ అని.. ఆరేళ్లకు ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడంటూ ఎమోషనల్ అవుతున్నారు.

మాస్ ఇంటర్వెల్ అని.. ఊరమాస్ క్లైమక్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రీ ఇంటర్వెల్ గూస్ బంప్స్, ఊరమాస్ ఇంటర్వెల్.. మరోసారి స్క్రీన్ ప్లే నీల్ అదరగొట్టేశాడు.

ప్రభాస్ కట్అవుట్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నాడు.. ప్రశాంత్ నీల్ షార్ట్ కట్స్ మైండ్ బ్లోయింగ్.. మెంటల్ ఎక్కించేశాడు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.