Most Recent

Salaar Movie: అడుగడుగునా ప్రభాస్ డిజిటల్ మోషన్ పోస్టర్స్.. థియేటర్లలో ఫ్యాన్స్ హడావిడి.. వీడియోస్ వైరల్..

Salaar Movie: అడుగడుగునా ప్రభాస్ డిజిటల్ మోషన్ పోస్టర్స్.. థియేటర్లలో ఫ్యాన్స్ హడావిడి.. వీడియోస్ వైరల్..

మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ ఈరోజు అడియన్స్ ముందుకు వచ్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతోపాటు.. యూఎస్‏లో సలార్ ప్రీమియర్ షోస్ చూసిన ఫ్యాన్స్ సినిమా అదిరిపోయిందంటున్నారు. ప్రభాస్ కట్అవుట్‏కు నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ పక్కా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‏లో థియేటర్ల వద్ద అర్దరాత్రి నుంచే ఫ్యాన్స్ హడావిడి మొదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. దాదాపు అన్ని థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రసిద్ధ సంధ్య థియేటర్‌ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద పెద్ద సమూహాలుగా కనిపిస్తున్నారు. సంధ్య థియేటర్ వద్ద పెద్ద కచేరీ.. వేడుకలగా కనిపిస్తుంది అక్కడి వాతావరణం. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సంధ్య థియేటర్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్స్, డిజిటల్ మోషన్ పోస్టర్స్ ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. థియేటర్లలో వివిధ రకాల లైట్స్ సెట్ చేశారు. వరుసగా ప్రభాస్ డిజిటల్ మోషన్ పోస్టర్స్, భారీ కటౌట్స్.. బ్యాగ్రౌండ్‏లో బాహుబలి మ్యూజిక్ వస్తుండడంతో చూస్తే గూస్‏బంప్స్ వస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. సలార్ రిలీజ్ అంటే పెద్ద పండగలా జరుపుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దాదాపు ఆరేళ్ల తర్వాత సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డార్లింగ్. చాలా కాలం తర్వాత ఊరమాస్ యాక్షన్‏తో అడియన్స్ ముందుకు వచ్చారు డార్లింగ్. సంధ్య థియేటర్ వద్ద అభిమానులు చేసిన భారీ కటౌట్స్, పోస్టర్లకు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.