Most Recent

Salaar Movie : ఇండియాలో మరే సినిమాకు లేనంత భారీ సెట్ సలార్‌దే.. అది ఎక్కడ వేశారో తెలుసా..

Salaar Movie : ఇండియాలో మరే సినిమాకు లేనంత భారీ సెట్ సలార్‌దే.. అది ఎక్కడ వేశారో తెలుసా..

ప్రభాస్ నయా మూవీ సలార్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. డైనోసార్ ఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.  ‘కేజీఎఫ్’ చిత్రాన్ని నిర్మించిన అదే టీమ్ ‘సలార్’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే..దాంతో సలార్  సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అంటున్నారు.  ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సాంకేతిక టెక్నీషన్స్దం ‘సలార్’ చిత్రానికి కూడా పని చేశారు. ‘సలార్’ చిత్రం ‘కేజీఎఫ్’ కంటే ఐదు రెట్లు పెద్దదని చిత్ర సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ తెలిపారు. అంతే కాదు ఆయన మాట్లాడుతూ మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘సలార్’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం రామోజీరావు ఫిల్మ్ సిటీలోనే జరిగింది. భువన్ చెప్పినట్లు రామోజీరావు లోపలే మరో ఓ రాజ్యాన్నే నిర్మించారు సలార్ టీమ్. సినిమా ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ అండ్ టీమ్ 100 ఎకరాల స్థలాన్ని వినియోగించి భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ 100 ఎకరాల సెట్‌ను రక్షించడానికి తాత్కాలికంగా పెద్ద గోడలు కూడా నిర్మించారట. ఇండియాలో మరే సినిమాకు ఇంత భారీ సెట్ వేయలేదట

సినిమాటోగ్రాఫ భువన్ గౌడ మాట్లాడుతూ.. ఈ సినిమా కేజీఎఫ్ కంటే ఐదు రెట్లు పెద్దదని చెబుతూ.. ‘‘సినిమా చాలా వరకు సెట్స్‌ లోనే చిత్రీకరించాం. సినిమాలో కేవలం 5 శాతం మాత్రమే వీఎఫ్‌ఎక్స్‌ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి సినిమా మరింత రియలిస్టిక్‌గా మారింది’’ అన్నారు. అలాగే భువన్ గౌడ ‘సలార్’ చిత్రానికి ఉపయోగించిన కెమెరా గురించి కూడా సమాచారం ఇచ్చారు, అలెక్సా 39 ‘సాలార్’ చిత్రానికి ఉపయోగించిన అత్యంత అధునాతన కెమెరా. ఈ కెమెరా లెన్స్ IMAX క్వాలిటీతో ఉంటాయి, అన్ని రకాల స్క్రీన్‌లలో కూడా అద్భుతమైన క్వాలిటీ దృశ్యాలను సృష్టిస్తాయి. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలకు భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. యశ్ తదుపరి సినిమా ‘టాక్సిక్’కి కూడా ఆయన సినిమాటోగ్రఫీ ఉండే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్’ డిసెంబర్ 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.