Most Recent

Prithviraj – Prabhas: ప్రభాస్‌ను డార్లింగ్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థం అయ్యింది..: ప్రృథ్విరాజ్‌

Prithviraj – Prabhas: ప్రభాస్‌ను డార్లింగ్ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థం అయ్యింది..: ప్రృథ్విరాజ్‌

ప్రస్తుతం దేశమంతా సలార్‌ ఫీవర్‌ నడుస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో సలార్‌ చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ హీరోగా నటించడం, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఆకాశాన్నంటేలా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌తో పాటు లిరికల్ సాంగ్స్‌ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

ఇక సలార్‌ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మలయాళ స్టార్‌ హీరో ప్రృథ్విరాజ్‌ సుకుమారన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌కు స్నేహితుడిగా ప్రృథ్విరాజ్‌ నటిస్తున్నారు. వీరిద్దరి స్నేహం నేపథ్యంలోనే సినిమా కథ మొత్తం ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతోంది. ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రృథ్విరాజ్‌ ప్రభాస్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌ ఇండస్ట్రీలో చాలా మంది డార్లింగ్‌ అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఇదే విషయమై ప్రృథ్వీరాజ్‌.. స్పందించారు. “ప్రభాస్‌ను డార్లింగ్‌ అని ఎందుకు పిలుస్తారో నాకు సలార్‌ సమయంలో అర్థమైంది. ప్రభాస్‌కు చాలా త్వరగా ఫ్రెండ్‌గా మారిపోయాను. ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతుక్కునే గిఫ్ట్ ప్రభాస్‌కు ఉంది. సెట్‍లో ఎప్పుడూ అందరి గురించి ప్రభాస్‌ చూసుకుంటారు. అందరూ మంచి ఆహారం తీసుకునేలా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటుంటారు. అప్పుడు అర్థమైంది ప్రభాస్‌ను డార్లింగ్‌ అని పిలిచేది ఇందుకేనా అని” అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.