Most Recent

Komati Reddy Venkat Reddy: తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్.. నంది అవార్డులపై స్పందించిన మంత్రి కోమటి రెడ్డి..

Komati Reddy Venkat Reddy: తెలుగు చిత్ర పరిశ్రమకు గుడ్ న్యూస్.. నంది అవార్డులపై స్పందించిన మంత్రి కోమటి రెడ్డి..

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు శుభవార్త అనే చెప్పాలి. ప్రతి ఏటా ఉగాది పండుగ సందర్భంగా నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రముఖ సీనియర్ సినీ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మురళీ మోహన్ కు నటసింహ చక్రవర్తి అనే బిరుదుతో సన్మానం చేశారు. ఆ తరువాత మురళీ మోహన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నంది అవార్డులు ఇవ్వాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

2024 ఉగాది నుంచి నంది అవార్డులను రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరిపినట్లు వివరించారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ప్రకటిస్తామన్నారు. చలన చిత్ర పరిశ్రమను సత్కరిస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు, కీర్తి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత కళాకారులకు నంది అవార్డుల ప్రస్తావనే లేకుండా పోయిందన్నారు నటుడు మురళీ మోహన్. దీనిపై స్పందించిన కోమటి రెడ్డి.. త్వరలోనే సినీ ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. అక్కడ మరిన్ని పూర్తి వివరాలపై చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.