Most Recent

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నితిన్‌ కొత్త సినిమా.. ఎప్పటి నుంచంటే..

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నితిన్‌ కొత్త సినిమా.. ఎప్పటి నుంచంటే..

నితిన్‌ హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వంక్కంతం వంశీ దర్శకత్వం వహించగా ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ఇక సీనియర్‌ హీరో రాజశేఖర్ ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించారు. హరీస్‌ జైరాజ్‌ సంగీతం, కామెడీ వంటివి అన్నీ సినిమాకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి.

సినిమా రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకర్షించలేకపోయిందనే చెప్పాలి. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం రాణించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిందని చెప్పాలి. అయితే నితిన్‌, శ్రీలీల జోడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇదిలా ఉంటే థియేటర్లలో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎక్స్‌ట్రా ఆర్డిరనీ మ్యాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్‌ కానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి వీక్‌ ప్రారంభంలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుందని వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్‌ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయని టాక్‌.

ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ ట్రైలర్..

ఇక ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్ క‌థ విషయానికొస్తే.. నితిన్‌ ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. అయితే హీరో కావాలని కోరిక ఉన్నా, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అదే సమయంలో హీరోగా ఛాన్స్‌ రావడంతో ఉద్యోగాన్ని వదిలేస్తాడు. అయితే చివరి క్షణంలో హీరోగా అవకాశం చేజారి పోతుంది. కానీ ఆ సినిమా కథలో ఉన్నట్లుగా నితిన్‌ జీవితంలో జరుగుతుంటాయి. ఇంతకీ సినిమా కథలో రాసుకున్న అంశాలు హీరో నిజ జీవితంలో ఎలా జరిగాయన్నదే ఈ సినిమా కథాంశం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.