Most Recent

12th Fail: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ సినిమా.. ’12th Fail’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

12th Fail: ఓటీటీలోకి వచ్చేస్తోన్న సూపర్ హిట్ సినిమా.. ’12th Fail’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి కొన్ని చిత్రాలు. స్టార్ నటీనటులు లేకపోయినా…కంటెంట్ నచ్చితే చాలు బ్రహ్మారథం పట్టేస్తున్నారు. చాలా రోజులుగా చిన్న సినిమాలు ఇటు థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అదే జాబితాలో ’12th Fail’ సినిమా ఒకటి. డైరెక్టర్ విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లీపర్ హిట్ గా నిలిచింది. ఇందులో విక్రాంత్ మాస్సే హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని IPS అధికారి మనోజ్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.50 కోట్లు రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.65.98 కోట్లు వసూలు చేసింది. అయితే బాలీవుడ్‏లో హిట్ అయినా ఈ సినిమా.. తెలుగులో మాత్రం ప్రేక్షకులకు అంతగా రీచ్ అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎక్కువగా దొరకకపోవడం.. జనాల్లోకి అంతగా వెళ్లేలేదు.

ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 29 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. షికారా (2020) తర్వాత విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన సినిమా ఇది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది.

UPSC ప్రవేశ పరీక్షకు ప్రయత్నించే లక్షలాది మంది విద్యార్థుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇంటర్మీడియట్ తప్పిన ఓ కుర్రాడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడు ?.. ఈ ప్రయాణంలో అతడు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. ఈ చిత్రంలో విక్రాంత్‌తో పాటు మేధా శంకర్, హరీష్ ఖన్నా, అన్షుమాన్ పుష్కర్, అనంత్ జోషి నటించారు. IPS అధికారి మనోజ్ కుమార్ శర్మ, IRS అధికారి శ్రద్ధా జోషి ప్రయాణం గురించి అనురాగ్ పాఠక్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. శంతను మోయిత్రా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.