
దేశమంతా దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సినీ సెలబ్రెటీస్ అందరూ దీపావళిని తమ కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పైన కనిపిస్తున్న ఫోటో కూడా తెగ వైరల్ అవుతుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా..? కూతురితో కలిసి అందమైన ఫోటోను షేర్ చేశారు ఆ హీరో. వర్సటైల్ అనే పదానికి ఈ హీరో నిలువెత్తు నిదర్శనం. ఇంతకు ఆ హీరో ఎవరు కనిపెట్టారా..? గుర్తుపట్టడం కష్టమే అని చెప్పాలి. ఇంతకు పై ఫొటోలో కూతురుతో ఉన్న హీరో మరెవరో కాదు..
పై ఫొటోలో కూతురిని ముద్దాడుతున్న హీరో ఎవరో కాదు. ఆయన అల్లరి నరేష్. హీరోగా అల్లరి నరేష్ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ హీరోగా తనదైన మార్క్ తో ప్రేక్షకులను నవ్వించారు నరేష్. అలాగే నేను, నాంది , ఉగ్రం లాంటి సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు నరేష్. అలాగే అల్లరి నరేష్ నుంచి ఎవ్వరు ఊహించని సినిమాలు వస్తున్నాయి.
హీరోగానే కాదు సైడ్ క్యారెక్టర్స్ లోనూ నటించి మెప్పించారు అల్లరి నరేష్. రవితేజ హీరోగా నటించిన శంభో శివ శంభో సినిమాలో అద్భుతంగా నటించారు నరేష్. అలాగే గమ్యం సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో మహేష్ స్నేహితుడిగా కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని నరేష్. అప్పుడప్పుడూ తన సినిమా అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ ను షేర్ చేస్తుంటారు. తాజాగా కూతురితో కలిసున్న ఈ బ్యూటీ ఫుల్ ఫోటోను షేర్ చేశారు.
View this post on Instagram
అల్లరి నరేష్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.