
ఇండస్ట్రీలో గుడ్ న్యూస్ లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్స్ ఇంట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ ఏడాది చాలా మంది పెళ్లి పీటలెక్కి కొత్తజీవితాన్ని ప్రారంభించారు. అందులో చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్. లావణ్య త్రిపాఠి పెళ్లి గురించే.. చాలా కాలంగా ప్రేమలో మునిగిపోయిన వీరిద్దరూ రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే కుర్ర హీరో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడన్న వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. త్వరలోనే ఈ శుభవార్త అందరితో పంచుకోనున్నారని తెలుస్తోంది. అలాగే మరో యంగ్ హీరో నిఖిల్ కూడా తండ్రి కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. దీని పై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్ళికి రెడీ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ బ్యూటీ మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా.
అందాల భామ తమన్నా తన నటన, గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ వెబ్ సిరీస్ లు సినిమాలు అంటూ హడావిడి చేస్తుంది.
ఇటీవలే బాలీవుడ్ లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తమన్నా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్తున్నారు. ఇప్పటికే మీడియా కంటికి పలుసార్లు చిక్కారు కూడా.. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు తమ డేటింగ్ కు పులిస్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. తమన్నా పెళ్లి పై ఇంట్లో ఒత్తిడి పెరగడంతో త్వరలోనే పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతుంది. ఇటీవలే తమన్నా, విజయ్ వర్మ కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి.
తమన్నా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..
View this post on Instagram
విజయ్ వర్మ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.