
సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో అన్నే నష్టాలున్నాయి. ముఖ్యంగా సినిమాల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ట్రెండ్ నడుస్తోంది. అదంటంటే సినిమా చూడ్డానికి వెళ్లిన వారు ఆ సినిమాకు సంబంధించిన క్లిప్‌లను స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. దీంతో సినిమాలపై ఇంట్రెస్టు తగ్గిపోతుంది. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో ఇది చాలా పెద్ద మైనస్‌గా మారింది. ముఖ్యంగా సినిమా చూస్తున్నప్పుడు చాలా మంది ఆ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, లేదా కొన్ని ఆసక్తికరమైన సీన్లు, స్పెషల్ రోల్స్ ఎంట్రీ సీన్ వంటివి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. షారుఖ్ ఖాన్ సినిమా ‘పఠాన్’ విడుదలైనప్పుడు, ఆ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ సన్నివేశాన్ని రికార్డ్ చేసి నెట్టింట వైరల్ చేశారు. ఇటీవల విడుదలైన ‘జైలర్’ సినిమా విషయంలోనూ అదే కథ జరిగింది. కొన్ని వారాల క్రితం విడుదలైన విజయ్ సినిమా ‘లియో’లోని కీలక సన్ని వేశాలను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఈనేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. దీపావళి కానుకగా ఆదివారం (నవంబర్ 12) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది.
‘ఎంతో నిబద్ధత, అభిరుచితో మేము ‘టైగర్ 3’ సినిమాను తెరకెక్కించాం. అయితే మా సినిమా చూసిన తర్వాత దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను దయచేసి సోషల్ మీడియాలో షేర్ చేయకండి. సినిమా చూసినప్పుడు కలిగే అనుభూతిని స్పాయిలర్స్ నాశనం చేయొచ్చు. దయచేసి ఇతర ప్రేక్షకులకు కూడా అదే వినోదాన్ని అందించండి. కాబట్టి మీరు ఇలాంటి పనులు చేయరని మేము ఆశిస్తున్నాం. ‘టైగర్3’ రూపంలో ఈ దీపావళికి మేము మీకు మంచి బహుమతి ఇస్తున్నామని భావిస్తున్నాం’’ అని సల్మాన్ ఖాన్ పోస్ట్ పెట్టారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన కత్రినా కైఫ్, విలన్ ఇమ్రాన్ హష్మీ కూడా ఇలా అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు.
కాగా టైగర్ సిరీస్‌లో ఇది మూడో సినిమా, ఇంతకు ముందు విడుదలైన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని సల్మాన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సుమారు రూ. 500 కోట్లతో ఈ మూవీని నిర్మించింది.
We have made #Tiger3 with a lot of passion & we are counting on you to protect our spoilers when you see the film. Spoilers can ruin the movie-watching experience. We trust you to do what is right. We hope #Tiger3 is the perfect Diwali gift from us to you!! Releasing in cinemas…
— Salman Khan (@BeingSalmanKhan) November 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..