
1991లో రజనీకాంత్ హీరోగా నటించిన ‘దళపతి’ భారీ విజయాన్ని అందుకుంది. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. అదే సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో నటించారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నటీనటులు మళ్లీ కలిసి నటించలేదు. అయితే సుమారు 33 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. రజనీకాంత్ 171వ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి కూడా నటిస్తాడని టాక్ వినిపిస్తోంది. గతంలో రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమాలో రజనీకాంత్ మరో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించారు. ఇప్పుడు తన తదుపరి చిత్రంలో మమ్ముట్టితో కలిసి నటించనున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ ‘లాల్ సలామ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కపిల్ దేవ్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ‘లాల్ సలామ్’ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
కాగా జైలర్ తర్వాత జై భీమ్ దర్శకుడు T.J జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇందులో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సుమారు 32 ఏళ్ల ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి ఒకే సినిమాలో నటిస్తుండడం విశేషం. ఇప్పుడు తలైవర్ 171లో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కనున్నట్లు సమాచారం. రాఘవ లారెన్స్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా రజనీ, మమ్ముట్టిల సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమచారం.
ഒരു തവണ ഒന്നിച്ചപ്പോ കിട്ടിയത് സൗത്ത് ഇന്ത്യൻ സിനിമ കണ്ടിട്ടുളത്തിൽ വെച്ച് തന്നെ ഏറ്റവും മികച്ച Superstar Mass combo
രജനിയുടെ കരിയറിൽ തന്നെ ഏറ്റവും വലിയ ഹിറ്റുകളിൽ ഒന്നും
അതേ combo തന്നെ ഒന്നു കൂടി ഒന്നിക്കുമ്പോൾ എന്താകുമ്പോ എന്തോ#Mammootty #Rajini #Lokesh pic.twitter.com/DPTp3HSTnA
— Kuttan Kuttan (@KuttanK44457025) November 10, 2023
After #Thalapathi #Mammootty & Rajini Team Up Again In #Thalaivar171
MEGA EPIC COMBO@Dir_Lokesh@mammukka@rajinikanth pic.twitter.com/dOzLQacnce
— Sarathc4 (@cinelocker) November 10, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..