Most Recent

Bigg Boss 7 Telugu: హౌస్‌లో రతిక రచ్చ.. నామినేషన్ కంటే అరుపులతోనే ఎక్కువ హడావిడి చేసిందిగా..

Bigg Boss 7 Telugu: హౌస్‌లో రతిక రచ్చ.. నామినేషన్ కంటే అరుపులతోనే ఎక్కువ హడావిడి చేసిందిగా..

బిగ్ బాస్ హౌస్ లో ఆడాళ్ళ రచ్చ మాములుగా లేదుగా నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టారు బిగ్ బాస్. అంతకు ముందు శివాజీ రతికాకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాడు. నామినేషన్స్ లో స్ట్రాంగ్ గా ఉండమని.. డిఫెండ్ చేసేటప్పుడు నిన్ను తిరిగి ప్రశ్నించే పరిస్థితి తెచుకోకు అని శివాజీ ఉచిత సలహా ఇచ్చాడు. దాంతో రతికా రెచ్చిపోయింది. అల్ రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లొచ్చిన రతికా.. ఆట చూసొచ్చి గేమ్ ఆడుతుంది. హౌస్ లో రెండు బ్యాచ్ లు ఉన్నాయి. ఒకటి సీరియల్ బ్యాచ్  రెండు శివాజీ బ్యాచ్. వైల్డ్ కార్డు తో తిరిగి హౌస్ లోకి వచ్చిన రతిక చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. వచ్చిన దగ్గర నుంచి శివాజీ చుట్టే తిరుగుతుంది. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఓ రేంజ్ లో యాటిట్యూడ్ చూపించింది.

నామినేషన్స్ లో శోభా శెట్టిని ముందుగా నామినేట్ చేసింది రతికా.. కెప్టెన్ గా నువ్వు నీ 100 పర్సెంట్ ఇచ్చావా అని శోభను ప్రశ్నించింది రతికా దానికి ఇచ్చాను అని శోభా ఎదో చెప్పే ప్రయత్నం చేసిన రతికా వినకుండా అరిచి గోల చేసింది. కెప్టెన్ అంటే బ్యాడ్జ్ పెట్టుకొని తిరగడం కాదు అంటూ రతికా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చూస్తున్న ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. శోభా చేసింది తప్పే అయినా తనను నామినేట్ చేయడానికి రతికాకు సరైన పాయింట్ దొరికినకూడా శివాజీ చెప్పాడని తొక్కలో యాటిట్యూడ్ చూపించింది.

ఆతర్వాత ప్రియాంకాను నామినేట్ చేసింది ప్రియాంకాను నామినేట్ చేసిన సమయంలో రతికా పిచ్చి పీక్స్ కు చేరింది. ప్రియాంకను ర్యాగ్ చేస్తూ చిత్రవిచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ పెట్టి బిగ్ బాస్ కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చింది రతిక కానీ ప్రేక్షకులకు మాత్రం “యాడ దొరికిన సంతరా బాబు..” అనిపించేలా చేసింది.  ప్రియాంకా మాట్లాడుతుంటే నాన్ సింక్ లో అరుస్తూ ఎదో చెప్పాలని ఎదో చెయ్యాలని ట్రై చేసి ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. కానీ మీమర్స్ కు మాత్రం మంచి స్టాఫ్ ఇచ్చింది రతికా.. ఆ తర్వాత ప్రియాంక రతికాను నామినేట్ చేసింది. అప్పుడు కూడా అరిచి గోల చేసింది. పాపం ప్రియాంకా మాత్రం రతికా దెబ్బకు బిత్తరపోయి చూస్తూ ఉండిపోయింది. ప్రియాంక అశ్వినిని నామినేట్ చేసేటప్పుడు కూడా మధ్యలో రతికా దూరి ఓవర్ యాక్టింగ్ చేసింది.. మొత్తానికి నిన్న రతికా నామినేషన్స్ పేరుతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

 

View this post on Instagram

 

A post shared by Rathika (@rathikarose_official)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.