Most Recent

Month Of Madhu: లవర్స్‌కు బంపరాఫర్‌.. ‘మంత్ ఆఫ్ మధు’ స్పెషల్‌ షోస్‌.. మీరూ వెళ్లాలనుకుంటే ఇలా చేయండి

Month Of Madhu: లవర్స్‌కు బంపరాఫర్‌.. ‘మంత్ ఆఫ్ మధు’ స్పెషల్‌ షోస్‌.. మీరూ వెళ్లాలనుకుంటే ఇలా చేయండి

కలర్స స్వాతి, నవీన్ చంద్ర హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం మంత్ ఆఫ్‌ మధు. చాలా రోజుల తర్వాత స్వాతి సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించడం, పోస్టర్స్‌, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. గతంలో ఇదే న వీన్‌ చంద్రతో కలిసి భానుమతి రామకృష్ణ అనే ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ను అందించిన దర్శకుడు శ్రీకాంత్ నగోతీ మంత్ ఆఫ్‌ మధును తెరకెక్కించారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమాలో మంజులా ఘట్టమనేని, శ్రేయ నావిలే కీలక పాత్రలో నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ఎమోషనల్‌ రైడర్‌ శుక్రవారం (అక్టోబర్‌ 6)న గ్రాండ్‌గా రిలీజ్‌ చేసింది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇక మొదటి నుంచి మంత్‌ ఆఫ్‌ మధు సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోంది స్వాతి. ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు పెట్టి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్‌ ఆఫ్‌ మధు ప్రమోషన్లలో భాగంగా ఒక బంపరాఫర్‌ ఇచ్చింది కలర్స్‌ స్వాతి. ప్రేమికుల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్స్‌ను ఏర్పాటు చేసింది మూవీ టీమ్. అది కూడా సీక్రెట్‌ గానే. గురువారం ( అక్టోబర్‌ 5)న సాయంత్రం హైదరాబాద్‌, విశాఖపట్నంలలో ఈ స్పెషల్‌ షోస్‌ పడనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది స్వాతి.

మీరూ వెళ్లాలనుకుంటున్నారా?

‘ప్రపంచం కంటే ముందే మీరు ప్రేమించిన వారితో కలిసి ఈ నిజమయిన ప్రేమకథను ఆస్వాదించండి’ అంటూ మంత్ ఆఫ్ మధు స్పెషల్‌ స్క్రీనింగ్స్ గురించి సమాచారాన్ని పంచుకుంది స్వాతి. మరి మీరు కూడా ఈ స్పెషల్ షోస్‌ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరూ ఒక ఫార్మ్‌ను నింపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్‌ను కూడా తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసింది మూవీ యూనిట్‌.

మరి మీ లవర్‌తో మంత్‌ ఆఫ్‌ మధు సినిమాను చూడాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్‌పై చేసి వివరాలు ఇవ్వండి.

మంత్‌ ఆఫ్‌ మధు సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చారు. గతంలో త్రిపుర అనే సినిమాలో స్వాతి, నవీన్‌ చంద్ర జంటగా నటించారు. ఇప్పుడు మళ్లీ మంత్‌ ఆఫ్‌ మధు అంటూ మన ముందుకు వచ్చారు. ప్రేమ వివాహాలు, విడాకుల నేపథ్యంతో నేటి జనరేషన్‌ను బేస్‌ చేసుకుని ఎమోషనల్‌గా ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

హైదరాబాద్, వైజాగ్ లలో  మంత్ ఆఫ్ మధు స్పెషల్ షోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.