Most Recent

Leo Movie: దళపతి విజయ్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన తమిళనాడు ప్రభుత్వం..!

Leo Movie: దళపతి విజయ్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన తమిళనాడు ప్రభుత్వం..!

దళపతి విజయ్ నటిస్తున్న నయా మూవీ లియో. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. లియో సినిమా రిలీజ్ కు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేయాలనీ రెడీ అవుతున్నారు. విజయ్ సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులకు పండగే. థియేటర్స్ ను పెళ్లికూతురుల ముస్తాబు చేస్తారు. అలాగే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు కూడా అభిమానులు దానికే రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్, టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇదిలా ఉంటే లియో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే.

లియో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు విజయ్ అభిమానులకు తమిళనాడు ప్రభుత్వం ఓ తీపి వార్త అందించింది.

విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న విడుదలవుతుండగా, ఆ రోజు అభిమానుల కోసం తెల్లవారుజామున స్పెషల్ షోలు వేసేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. చిత్ర బృందం , ‘లియో’ చిత్ర ప్రదర్శకులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం తెలిపింది. ‘లియో’ సినిమా ప్రొడక్షన్ హౌస్ రెండు స్పెషల్ షోలు వేయాలని కోరింది. అక్టోబర్ 19వ తేదీ ఉదయం 4, 7 గంటలకు రెండు షోలు, అక్టోబర్ 20 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 7 గంటలకు ఒక షో ప్రదర్శించేందుకు అనుమతి కోరగా, అనుమతి  ఇచ్చింది ప్రభుత్వం.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పనికి పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపింది. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ‘లియో’ సినిమా ఆడియో రిలీజ్ నిర్వహించేందుకు చెన్నై పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ సందర్భంగా జరిగిన గొడవ కారణంగా ‘లియో’ ఆడియో లాంచ్ నిరాకరించారు. దాంతో ఆ  సమయంలో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.  

‘లియో’ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ సినిమా ట్రైలర్ కొద్ది రోజుల క్రితం విడుదలై వైరల్‌గా మారింది. ఈ సినిమాలో విజయ్ రెండు షేడ్స్‌లో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. నటి త్రిష చాలా కాలం తర్వాత మళ్లీ విజయ్‌తో కలిసి నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందించారు. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.