Most Recent

Leo Movie: లియో ట్రైలర్‌ రిలీజ్‌లో విజయ్‌ ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. థియేటర్‌ ధ్వంసం.. వైరల్‌ వీడియో

Leo Movie: లియో ట్రైలర్‌ రిలీజ్‌లో విజయ్‌ ఫ్యాన్స్‌ అత్యుత్సాహం.. థియేటర్‌ ధ్వంసం.. వైరల్‌ వీడియో

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ విజయ్ దళపతికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొందరు అభిమానులు మాత్రం అప్పుడుప్పుడు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హింసాత్మకంగా వ్యవహరిస్తూ తమ అభిమాన హీరోకు చెడ్డపేరు తెస్తున్నారు. విజయ్‌ లేటెస్ట్‌ సినిమా లియో ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా ఇది మరోసారి నిరూపితమైంది. విజయ్‌ ఫ్యాన్స్‌ అత్యుత్సాహంతో థియేటర్‌లోని సీట్లను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. విజయ్ కొత్త సినిమా ‘లియో’ ట్రైలర్ గురువారం (అక్టోబర్ 05) సాయంత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చెన్నై పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కొన్ని థియేటర్లలో ఈ సినిమా ట్రైలర్ ను ప్రదర్శించారు. దీంతో విజయ్‌ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. చెన్నైలోని రోహిణి సినిమాలో ‘లియో’ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసిన విజయ్ అభిమానులు కేకలు వేయడమే కాకుండా అత్యుత్సాహంతో థియేటర్‌లోని కుర్చీలను విరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు దయచేసి ఇలాంటి పనులు చేయద్దంటూ వేడుకుంటున్నారు.

మరోవైపు యూట్యూబ్‌లో లియో ట్రైలర్‌ రికార్డులు కొల్లగొడుతోంది. విజయ్ ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చేలా దర్శకుడు లోకేష్ కనగరాజ్ అన్ని ఎలిమెంట్స్ ఇస్తున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ‘లియో’ చిత్రంలో విజయ్‌కి జోడీగా త్రిష కృష్ణన్‌ నటించింది. దశాబ్దం తర్వాత ఈ జంట వెండితెరపై మళ్లీ ఒక్కటైంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది.

 వైరలవుతోన్న వీడియోస్..

థియేటర్లలోని కుర్చీలు ధ్వంసం..

 

సీఎం సీఎం అంటూ నినాదాలు..

లియో సినిమా ట్రైలర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.