Most Recent

God Movie Review : ఆకట్టుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్.. గాడ్ సినిమా ఎలా ఉందంటే

God Movie Review : ఆకట్టుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్.. గాడ్ సినిమా ఎలా ఉందంటే

మూవీ రివ్యూ: గాడ్

నటీనటులు: జయం రవి, నయనతార, నరేన్, వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయలక్ష్మి తదితరులు

ఎడిటర్: జె.వి మణికంద బాలాజీ

సినిమాటోగ్రాఫర్: హరి కే వేదాంతం

సంగీతం: యువన్ శంకర్ రాజా

నిర్మాత: జరీష్ రాజా

దర్శకుడు: అహ్మద్

నయనతార సినిమాలకు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంటుంది తాజాగా ఆమె ఇరైవన్ అనే సినిమా తెలుగులో గాడ్ పేరుతో తీసుకొచ్చారు. మరి ఇది ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

ఒక సిటీలో సైకో కిల్లర్ ఉంటాడు. అతడి పేరు బ్రహ్మ (రాహుల్ బోస్). అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపేస్తుంటాడు. అలాంటి నరరూప రాక్షసుడిని ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ (జయం రవి), అతని స్నేహితుడు ఆండ్రూ (నరేన్) కలిసి పట్టుకుంటారు. ఆ కిల్లర్ ను పట్టుకున్న తర్వాత కూడా అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అవ్వడమే కాదు.. క్రూరంగా చంపబడుతుంటారు. అసలు వాళ్లని చంపేది ఎవరు? ఆ సైకో కిల్లర్ ఎందుకు అలా చేస్తున్నాడు.. వాళ్లను అర్జున్ ఎలా పట్టుకున్నాడు అనేది మిగిలిన కథ. ప్రియా (నయనతార), అర్జున్ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది తెరమీద చూడాల్సిందే..

కథనం:

సైకో కిల్లర్ కథలు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇదే ఫార్మేట్ లో వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొత్త కథ అంటూ ఉండదు. ఉన్న కథను ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అన్నట్టు తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారు. ఈ విషయంలో గాడ్ సినిమా దర్శకుడు అహ్మద్ పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. ఆల్రెడీ తెలిసిన కథనే ఇంకాస్త రొటీన్ స్క్రీన్ ప్లేతో చెప్పాడు అహ్మద్. నగరంలో ఒక సైకో ఉంటాడు.. అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు.. అది కేవలం అతడి ఆనందం కోసం మాత్రమే.. చనిపోయే ముందు అమ్మాయిలు పెట్టే కేకలు అతనికి చాలా సంతోషాన్ని ఇస్తాయి.. కాబట్టి ఎలాంటి మోటో లేకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అతన్ని పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. వినడానికి చాలా సింపుల్ కథ ఇది. కానీ దీన్ని అద్భుతంగా స్క్రీన్ మీదకు తీసుకురావచ్చు. ఫస్ట్ ఆఫ్ వరకు అహ్మద్ ఈ పని విజయవంతంగా పూర్తి చేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా గాడ్ రూపొందించాడు. మరీ ముఖ్యంగా ఫస్ట్ సీన్ లోనే కిల్లర్ ఎవరో చూపించడం అనేది దర్శకుడు స్క్రీన్ ప్లే చాతుర్యానికి నిదర్శనం. ఆ తర్వాత కూడా కథను ఆసక్తికరంగానే ముందుకు నడిపాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం పూర్తిగా వదిలేశాడు. దర్శకుడు అప్పటికే కథ మొత్తం తెలిసిపోవడం.. విలన్ ఎవరో గెస్ చేయడంతో క్లైమాక్స్ వరకు కథ మెల్లగా సాగుతుంది. ఎండింగ్ కాస్త ఆసక్తి క్రియేట్ చేసినా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మాత్రం కాదు. జయం రవి, నయనతార మధ్య సన్నివేశాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ సినిమాలో నయనతార లాంటి పెద్ద హీరోయిన్ అవసరం లేదు. ఆమె క్యారెక్టర్ కూడా ఏదో ఉంది అంటే ఉంది. ఓవరాల్ గా గాడ్ సినిమా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు కొంతమేర నచ్చుతుంది.

నటీనటులు:

జయం రవికి ఇలాంటి పోలీస్ క్యారెక్టర్స్ కొత్త కాదు. గతంలో కూడా చాలా సినిమాల్లో ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశాడు. ఇందులో కూడా తన పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేశాడు. ఇక నయనతార కూడా ఉన్నంతవరకు బాగానే నటించింది. కానీ ఆమె లాంటి పెద్ద హీరోయిన్ ఇందులో పెద్దగా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నరేన్ ఉన్నది కాసేపైనా అద్భుతంగా నటించాడు. మరో కీలకమైన పాత్రలో రాహుల్ బోస్, వినోద్ కిషన్ తమ నటన చూపించారు. మిగిలిన వాళ్ళందరూ ఓకే..

టెక్నికల్ టీం:

థ్రిల్లర్ సినిమాలకు సంగీతం ప్రధాన ఆయుధం. ఎందుకంటే ఇందులో పాటలు తక్కువగా ఉంటాయి.. కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రమే ఉంటుంది. ఈ విషయంలో యువన్ శంకర్ రాజా తన 100% ఇచ్చాడు. కేవలం రెండు గంటల సినిమా మాత్రమే అయినా కూడా సెకండ్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది. ఈ విషయంలో ఎడిటర్, దర్శకుడు ఇంకాస్త చర్చించి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు అహ్మద్ ఫస్టాఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సెకండ్ హాఫ్ వదిలేసాడేమో అనిపించింది. అక్కడ ఇంకాస్త టైట్ స్క్రీన్ ప్లే ఉండుంటే సినిమా ఖచ్చితంగా ఆకట్టుకునేది.

పంచ్ లైన్:

గాడ్.. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు జస్ట్ ఓకే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.