Most Recent

Bigg Boss 7 Telugu: మళ్లీ కెప్టెన్సీ దక్కించుకున్న రైతు బిడ్డ.. వికసించిన అమరం.. శోభకు దారుణమైన శిక్ష..

Bigg Boss 7 Telugu: మళ్లీ కెప్టెన్సీ దక్కించుకున్న రైతు బిడ్డ.. వికసించిన అమరం.. శోభకు దారుణమైన శిక్ష..

ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్ల మధ్య సాగుతున్న టాస్క్‌ ఈ రోజు అంటే.. 39th ఎపిసోడ్‌లోనూ కంటిన్యూ చేశాడు బిగ్ బాస్. ఇరు ఆటగాళ్ల మధ్య ఫిట్టెస్ట్‌, స్ట్రాంగెస్ట్, జీనియస్, ఫాస్టెస్ట్.. ఎవరో టాస్కుల ద్వారా చెక్ చేసిన బిగ్ బాస్.. ఆ తరువాత మరికొన్ని టాస్క్‌లును కూడా తాజా ఎపిసోడ్‌లో పెట్టాడు. ఈ టాస్కులన్నీ ముగిసిన తర్వాత.. చివరగా.. విన్నర్ అయిన గ్రూప్ నుంచి కెప్టెన్సీ కంటెండర్స్‌ గా ఎన్నికవుతారని చెబుతాడు. దీంతో ఇరు గ్రూప్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ.. తమ శక్తి మేరకు.. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతీ టాస్క్‌లో గెలిచేందుకు ట్రై చేస్తూనే ఉంటారు.

ఇక నిన్నటి అంటే..39 ఎపిసోడ్ అంతా రసవత్తర టాస్కులతో సాగగా.. ఇవ్వాల్టి అంటే.. 40th ఎపిపోడ్ మాత్రం.. ప్రీవియస్ ఎపిసోడ్‌తో పోల్చుకుంటే కాస్త తేలిపోయింది. గూస్ బంప్స్ వచ్చే టాస్కుల డోస్ తగ్గిపోవడం.. హంగామా చేసే కంటెస్టెంట్స్ ఫుటేజ్ పెరిగిపోవడంతో.. కాస్త బోరింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ అందులోనూ.. బిగ్ బాస్ చెప్పే ఓ గుడ్‌ న్యూస్.. అందర్నీ .. అందులోనూ.. పల్లవి ప్రశాంత్ అభిమానులను పిచ్చ హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తుంది. చెప్పాలంటే.. ప్రశాంత్‌కు ఓ హీరోయిక్ మూమెంట్‌ను యాడ్ చేస్తుంది.

38వ రోజు సరిగ్గా రాత్రి 10 గంటలా 30 నిమిషాలకు.. హౌస్‌లో ఉన్న శివాజీ, తేజ, అమర్ , ప్రియాంక సీరియస్ డిస్కషన్ పెట్టుకుంటారు. పోటుగాళ్లు గెలవడానికి కారణం సీక్రెట్ రూం నుంచి బయటికి వచ్చిన గౌతమ్‌ కారణం అంటూ… తేజ చెబుతుండగా.. వాడికి అంత సీన్‌ లేదంటూ.. వాళ్ల గెలుపుకు కారణం అర్జున్ అంటూ. అమర్ వాదిస్తుంటాడు. శివాజీ ఎటూ మాట్లాడలేక .. పెద్ద మనిషి తరహాలో ఇద్దరికీ సపోర్ట్ చేస్తుంటాడు. ఇక ఓ పక్క ఇది కంటిన్యూ అవుతుండగా.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను కన్ఫెషన్ రూంలోకి పిలుస్తాడు బిగ్‌ బాస్. కెప్టెన్సీ విధులు తెలుసుకోవాలని.. సీరియస్ గా ఉండాలని చెప్పి తిరిగి కెప్టెన్ బ్యాడ్జ్‌ తీసుకోవాలని ఆదేశిస్తాడు. దీంతో పల్లవి ప్రశాంత్ మరో సారి ఎమోషనల్ అవుతూ.. బిగ్ బాస్‌ కు థ్ఆయంక్స్ చెబుతాడు.

ఇక బ్యాడ్జ్‌ ధరించిన పల్లవి ప్రశాంత్ పుష్ప రాజ్‌ మళ్లే బయటికి వచ్చి… కాలుతో.. గట్టిగా నేలను కొట్టి సౌండ్ చేస్తాడు. దీంతో హౌస్‌లో ఉన్న సభ్యులందరూ ఎక్జైట్‌గా ప్రశాంత్ దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేస్తారు.

ఇక 39వ రోజు ఉదయం 9 గంటలకు.. రవితేజ సినిమాలోని ఫుల్ కిక్కు సినిమాలోని సాంగ్‌తో.. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ను నిద్ర లేపిన బిగ్ బాస్.. ఆ తరువాత వీళ్ల కోసం కెప్టెన్సీ టాస్క్‌ను ఇచ్చే పనిలో ఉంటారు. కానీ ఈ క్రమంలోనే.. హౌస్‌లో ఉన్న శోభ తన మేకప్ కిట్‌ను .. పోటుగాళ్ల నుంచి దొంగతనం చేస్తుంది. దీంతో దొంగ అంటూ వాయిస్ రావడంతో కనీసం మేకప్ కిట్ ఇప్పించాలని బిగ్‌ బాస్‌ను కోరుతుంది.

కానీ బిగ్ బాస్ నుంచి ఎంతకీ రెస్పాన్స్ రాకపోవడంతో.. నయన నుంచి కొద్దిగా హైలైనర్‌ను తీసుకుని రాసుకుంటుంది. ఇక శోభ చేసిన పనితో కాస్త సీరియస్ అయిన బిగ్ బాస్ .. హెడ్ ఆఫ్ లగేజ్ అయిన అర్జున్, అశ్విని పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించాలని చెబుతాడు. తప్పుచేసిన శోభకు పన్షిష్మెంట్ ఇవ్వాలని ఆదేశిస్తాడు. దీంతో అర్జున్.. తేజ మూడు రోజుల నుంచి వేసుకుని.. ఉప్పు పట్టిపోయి. మాసిన టీ షెర్ట్‌ను వేసుకోవాలని శిక్ష విధిస్తాడు. శోభ కూడా.. మారు మాట్లాడకుండా.. ఆ శిక్షను యాక్సెప్ట్ చేస్తుంది.

ఇక మరో పక్క.. ప్రిన్స్ యావర్.. నయని పావనితో.. పులిహోర కలుపే ఎపిసోడ్‌ను ఎపిసోడ్‌ను సక్సెస్‌ పుల్‌గా ఫినిష్‌ చేస్తుంటాడు. ‘నువ్వు సింగిలా అని అడిగి.. లేదని పావని చెప్పడంతో’ ఎగిరి గంతేస్తాడు.

ఇక మరో పక్క తేజ ఆవలింపు తీయడంతో.. ఆవలింపు అంటు వ్యాధి లాంటిదని.. అందునే.. స్పెషల్‌గా తేజకు 5 నిమిషాలు నిద్ర పోయే అవకాశం ఇస్తాడు. ఇందుకు శోభను సంచాలక్‌ గా వ్యవహరించాలని చెబుతాడు. అయితే ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న తేజ.. హౌస్‌లో మంచి ఫన్‌ను క్రియేట్ చేస్తాడు. అందర్నీ నవ్విస్తూనే.. శోభను విపరీతంగా ఆటపట్టిస్తుంటాడు.

ఇక నవ్వుల మధ్యలో.. కంటెస్టెంట్స్ అందరి హంగామా మధ్యలో.. హూ ఈజ్‌ ది స్మాటెస్ట్ అనే టాస్క్‌ను కండక్ట్ చేస్తాడు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు సరై సమాధానాలను.. ఎగ్జాగోనల్ ప్లేట్‌ నుంచి తీసుకుని బోర్డ్‌పై పెట్టాలని చెబుతాడు. అయితే.. క్రేజీ క్రేజీ ప్రశ్నలు.. హౌస్‌ మేట్స్‌ ఆన్సర్లు.. మధ్యలో కొట్టుకోడాలు.. కన్ఫూజ్ అవడాల మధ్యలో.. పోటగాళ్ల పై ఆటగాళ్లే గెలుస్తాడు. దీంతో ఓ రేంజ్‌లో హంగామా చేస్తాడు.

 

 

ఇక తరువాత కెస్టెన్సీ కంటెడర్స్ ఎన్నికలో భాగంగా.. 6వ టాస్క్‌ను ఇస్తాడు బిగ్ బాస్. గాలితో నిండిన బుగ్గను ఒక్కొక్కరిగా ఎగరవేస్తూ.. కింద ఉన్న రంగు రంగుల బాల్స్‌ను తమకిచ్చిన బుట్టలో వేయాలని చెబుతాడు బిగ్ బాస్. అందుకోసం ఇరు జట్లు రెండు రంగులున్న బాల్స్‌ను సెలక్ట్ చేసుకోవాలని సూచిస్తాడు. దీంతో.. ఆటగాళ్లు రెడ్ అండ్ గ్రీన్ ను పిక్ చేసుకోగా.. పోటుగాళ్లు బ్లూ అండ్ ఎల్లో కలర్‌ను పిక్ చేసుకుంటారు. ఇక రసవత్తరంగా సాగిన ఈ టాస్క్‌లో.. ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్‌ మధ్య.. మళ్లీ ఆటగాళ్లే గెలుస్తారు. దీంతో ఫైనల్ పట్టికలో.. చెరి మూడు పాయింట్లతో.. ఆటగాళ్లు.. పోటుగాళ్లు సమానంగా నిలుస్తాడు. ఆ తరువాత ఏం అవుతుందా అనే డౌట్‌ అండ్ ఈగర్‌ను బీబీ ఆడియెన్స్‌కు కలిగిస్తారు.

 

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.